Apple iPhone 15 Plus విడుదలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో ఈ కొత్త ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. iPhone 15 లైన్‌లో 2022లో మనం చూసినట్లుగానే నాలుగు మోడల్‌లు ఉండవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. vanilla iPhone 15ని iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone 15తో పాటు ఆవిష్కరించే అవకాశం ఉంది.  iPhone 15,  iPhone 15 Pro రెండర్‌లను చూపించిన తర్వాత, 9to5Mac నివేదిక కొత్త iPhone 15 Plus వివరాలను వెల్లడించింది. ఈ మోడల్ లో గత సంవత్సరం iPhone 14 Plusలో మిస్సైన డైనమిక్ ఐలాండ్‌ ఉంటబోతున్నట్లు వివరించింది.


డైనమిక్ ఐలాండ్‌ తో 15 లైనప్ విడుదల?


ఐఫోన్ 15 సిరీస్ ఐఫోన్ 14 సిరీస్ మాదిరిగానే డిస్ ప్లే పరిమాణాన్ని కలిగి ఉంటుంది. అయితే, iPhone 15 Pro Max మోడల్ 'అల్ట్రా' మోనికర్‌ను కలిగి ఉండవచ్చు తెలుస్తోంది. సామ్ సంగ్ దాని సూపర్-ప్రీమియం ఫ్లాగ్‌ షిప్ గెలాక్సీ S మోడల్‌  కోసం అల్ట్రా మోనికర్‌ను కూడా ఉపయోగిస్తుంది. కొత్త ఐఫోన్ లైనప్ అధికారికంగా ఆవిష్కరించడానికి ముందు,  కొత్త ఉత్పత్తులకు సంబంధించి ఆసియాలోని అనుబంధ తయారీదారులకు CAD ఫైల్‌లను Apple పంపింది. ప్రస్తుతం ఈ ఫైల్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి. తాజా ఫైల్స్ పరిశీలిస్తే ఆపిల్ తదుపరి ఐఫోన్ 15 లైనప్ మొత్తం డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. నాచ్ ఇకపై ప్రస్తుత మోడల్ ఐఫోన్ ఫీచర్ కాదని 9to5Mac నివేదిక తెలిపింది. ఐఫోన్ 14 ప్లస్ కంటే ఐఫోన్ 15 ప్లస్‌ లో బెజెల్స్ సన్నగా ఉంటాయని తెలిపింది.






USB-C ఛార్జింగ్ పోర్ట్‌ తో Apple ఫోన్లు


9to5Mac గత నివేదిక ప్రకారం, గత సంవత్సరం ఐఫోన్ 14 ప్రోతో పోల్చినప్పుడు iPhone 15 ప్రోలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉండనున్నాయి.  వీటిలో అతిపెద్ద మార్పు ఏమిటంటే, USB-C ఛార్జింగ్ పోర్ట్‌ తో Apple యొక్క లైట్నింగ్ పోర్ట్‌ ను మార్చుకోవడం. CAD ఆధారంగా ఈ వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుత మోడల్ మాదిరిగానే, USB-C పోర్ట్ దిగువన, ఫైరింగ్ స్పీకర్ పక్కన ఉంచబడింది.






గత సెప్టెంబర్ లో ఐఫోన్ 14 లైనప్ లాంచ్


ఇక ఆపిల్ కంపెనీకి చెందిన  ఐఫోన్ 14 లైనప్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభించబడింది. లాంచ్ సమయంలో భారతదేశంలో ఐఫోన్ 14 ధర రూ.79,900గా. ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900గా నిర్ణయించబడింది.


Read Also: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!