స్మార్ట్ ఫోన్ వాడే సమయంలో ఇంటర్నెట్ స్లోగా రావడం చాలా మందికి చికాకు కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం కోసం వెతుకుతున్న సమయంలో నెట్ స్పీడ్ తగ్గడం వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు. UPI లావాదేవీలు జరిపే సమయంలో నెట్ స్లో కావడం వల్ల ఇబ్బందులు ఎదరవుతాయి. ఒక్కోసారి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా, ఎదుటి వారికి చేరుకోకుండా ప్రాసెసింగ్ లో పడిపోవడం వల్ల, మూడు నాలుగు రోజుల పాటు డబ్బులు రాక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆఫీస్ లో ఉన్నప్పుడు వైఫై వాడినా, బయటకు వెళ్లినప్పుడు ఫోన్ డేటానే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వేగం తగ్గినప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మళ్లీ స్పీడ్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
డేటా స్పీడ్‌ని పెంచుకునే టిప్స్ ఇవే
ముందుగా మొబైల్ ఇంటర్నెట్ వేగం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం పలు యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఉన్నాయి. Ookla Speedtestలో స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ యాప్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. స్పీడ్ టెస్ట్ చేసుకునేందుకు యాప్ ను ఓపెన్ చేసి ‘GO’ బటన్ నొక్కాలి. ఇప్పుడు యాప్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాన్ని చూపిస్తుంది.
DNS ఛేంజర్ తో నెట్ స్పీడ్ పెంచుకునే అవకాశం
స్పీడ్ టెస్టులో మీ ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నట్లు తేలితే DNS సర్వర్ మార్చుకోవడం ద్వారా వేగాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
DNS సర్వర్‌ను ఇలా మార్చుకోవాలి
Google Play Storeలో Android స్మార్ట్ ఫోన్ల కోసం చాలా DNS ఛేంజర్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నచ్చిన DNS ఛేంజర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి నెట్‌వర్క్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయడానికి యాప్‌కి అవసరమైన అనుమతులను ఇవ్వాలి. మీరు ఉపయోగించాలి అనుకుంటున్న DNS సర్వర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీ యాప్ సూచించిన డిఫాల్ట్ DNS సర్వర్‌ని కూడా ఉపయోగించవచ్చు. లేదంటే మీకు నచ్చిన DNS సర్వర్ IP అడ్రస్ ను మాన్యువల్‌గా నమోదు చేయవచ్చు. DNS సర్వర్ వేగాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఆ తర్వాత కొత్త DNS సర్వర్‌ని పొందేందుకు ‘స్టార్ట్’ అనే బటన్ ను నొక్కాలి. ఇప్పుడు కొత్త DNS సర్వర్ మీ మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతుంది. అయితే, DNS సర్వర్ ను ఎంచుకునే సమయంలో సురక్షితమైన వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి.
మొబైల్ ఇంటర్నెట్ వేగం పెంచే మరికొన్ని చిట్కాలు
క్రాష్, కుక్కీలను క్లియర్ చేయాలి - మోబైల్ ఫోన్ లో క్రాష్, కుక్కీలను క్లియర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగవంతం అవుతుంది.
డేటా సేవింగ్ మోడ్‌ని ఆన్ చేయాలి- ఫోన్ లో డేటా సేవింగ్ మోడ్ ను ఆన్ చేయడం కూడా ఇంటర్నెట్ వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది.
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి - ఒకేసారి చాలా యాప్‌లను రన్ కావడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. RAMని ఖాళీ చేయడం వలన ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. ఇందుకోసం బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి.
ఆటో-అప్‌డేట్‌లను నిలిపివేయాలి - ఆటోమేటిక్ అప్‌డేట్‌లు చాలా డేటాను తీసుకుంటాయి. దీని వలన ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో యాప్‌ల ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఆఫ్ చేయాలి.
Read Also: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!