iPhone 14: మీరు ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14 కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. మీరు ఇప్పుడు ఐఫోన్ 14ని చవకగా చేయవచ్చు. వాస్తవానికి ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో మీకు అనేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చవకగా కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో iPhone 14 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 అయినప్పటికీ, Flipkartలో ఈ ఫోన్ ఇంకా తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి.


ప్రస్తుతం ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.72,499కే అందుబాటులో ఉంది. ఇది కాకుండా కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఈ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ.నాలుగు వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.


దీంతోపాటు రూ.23 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందించనున్నారు. మీరు ఈ అన్ని ఆఫర్‌లను ఉపయోగించినట్లయితే ఐఫోన్ 14ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు.


ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.


దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.


ఐఫోన్ 14తో పాటు 14 ప్లస్ కూడా అందుబాటులో ఉంది. దీని విషయానికి వస్తే... ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.


దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.


మరిన్ని ఫోన్లపై ఆఫర్లు
ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి మీరు Poco X4 Pro 5Gని రూ.16,499కి, Infinix Hot 20 Playని రూ.8,199కి, Vivo T11 44Wని రూ.14,499కి, Poco C31ని రూ.7,749కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై మీకు 30 నుండి 35 శాతం తగ్గింపు లభించనుంది.


గమనిక: ఈ ఆఫర్లు కాలానుగుణంగా మారవచ్చు. ఖచ్చితమైన సమాచారం కోసం ఈ-కామర్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.