ఐవోఎస్ 16, వాచ్ఓఎస్ 9లను యాపిల్ గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు కొన్ని పాత ఐఫోన్ మోడల్స్‌కు ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఐవోఎస్ 16 ద్వారా కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా అందించనున్నారు. ఫోకస్ మోడ్, కొత్త లాక్ స్క్రీన్‌లతో పాటు హైడ్ చేసిన లేదా తాజాగా డిలీట్ చేసిన ఆల్బమ్స్‌కు మరింత ప్రైవసీని కల్పించనున్నారు. ఐమెసేజెస్, షేర్ ప్లే, నోటిఫికేషన్లు, మ్యాప్స్, సఫారీ, వాలెట్ వంటి వాటికి మరిన్ని ఫీచర్లు అందించనున్నారు.
వాచ్ఓఎస్ 9లో ఫీచర్లున్న వర్కవుట్ యాప్, కొత్త మెడికేషన్స్ యాప్ ఉండనున్నాయి. వీటి ద్వారా స్లీప్, హార్ట్ హెల్త్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ X సిరీస్, ఐఫోన్ 8 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2020), ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లకు ఐవోఎస్ 16 అప్‌డేట్ అందించనున్నారు.
ఐవోఎస్ 16 విడుదల ఎప్పుడు?
మనదేశంలో ఐవోఎస్ 16 సెప్టెంబర్ 16వ తేదీన రాత్రి 10:30 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్‌లో జనరల్ ఆప్షన్‌కు వెళ్లి అక్కడ సాఫ్ట్ వేర్ అప్‌డేట్స్‌లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పబ్లిక్ బీటా ఇప్పటికే కొంతమందికి విడుదల అయింది.
ఐవోఎస్ 16 ఇన్‌స్టాల్ చేసుకోవచ్చా?
ఐవోఎస్ 16ను ఇన్‌స్టాల్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కొంతమంది ఏం అంటున్నారంటే అప్‌డేట్ రాగానే ఇన్‌స్టాల్ చేసుకోకుండా ఒక రెండు, మూడ్రోజులు ఆగి ఎటువంటి లోపాలు లేకపోతే ఇన్‌స్టాల్ చేసుకోవడం నయం అని కొందరు అంటున్నారు. అయితే కొత్త ఫీచర్లు కావాలంటే మాత్రం ఇన్‌స్టాల్ చేసుకోక తప్పదు.