ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 స్మార్ట్ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీలో 32 అంగుళాలు, 43 అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆడియోను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ యాప్స్‌కు దీని రిమోట్‌లో ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 స్మార్ట్ టీవీ ధర
ఇందులో 32 అంగుళాల వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ఇక 43 అంగుళాల వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని మార్చి 12వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య కొనుగోలు చేయవచ్చు. ప్రీ-బుకింగ్ ఆఫర్ కింద రూ.1,499 విలువైన ఇన్‌ఫీనిక్స్ స్నోకర్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌ను రూ.1కే కొనుగోలు చేయవచ్చు. ఇవి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,017 ధరకు అందుబాటులో ఉన్నాయి.
ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు
ఇందులో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే, 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో కఠినమైన బ్లూ లైట్‌ను ఎలిమినేట్ చేయడానికి యాంటీ బ్లూ రే టెక్నాలజీని అందించారు. హెచ్‌డీఆర్10 కంటెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. క్వాడ్‌కోర్ రియల్‌టెక్ ఆర్టీడీ2841 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 1 జీబీ వరకు ర్యామ్, 8 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
కంపెనీ తెలిపిన దాని ప్రకారం... ఇందులో స్టీరియో స్పీకర్ సెటప్ ఉండనుంది. 32 అంగుళాల మోడల్‌లో 20W టోటల్ అవుట్‌పుట్ అందించే రెండు బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. ఇక 43 అంగుళాల మోడల్‌లో రెండు బాక్స్ స్పీకర్లు, రెండు ట్వీటర్లు అందించారు. ఇది 36W అవుట్‌పుట్‌ను అందించనుంది. ఈ రెండు స్క్రీన్ సైజులూ డాల్బీ ఆడియోను సపోర్ట్ చేయనున్నాయి. వీటిలో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు, మినీ వైపీబీపీఆర్ వీడియో అవుట్‌పుట్ పోర్టును అందించారు. ఇందులో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది.
ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ టీవీ పనిచేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి పాపులర్ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీసెస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. గూగుల్ అసిస్టెంట్‌కు డెడికేటెడ్ బటన్ ఇందులో అందించారు. ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఇందులో 32 అంగుళాల వేరియంట్ బరువు 3.98 కేజీలు గానూ, 43 అంగుళాల వేరియంట్ బరువు 6.42 కేజీలుగానూ ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?