Infinix Smart 8 Plus: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు. భారీ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఫోన్ వెనకవైపు చూడవచ్చు. ఇందులో మ్యాజిక్ రింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇది యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహా ఫీచర్‌లా పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ రన్ కానుంది.


ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ధర, ఆఫర్లు ఇలా...
ఈ ఫోన్‌ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చింది. ఈ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. కానీ బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు ఎక్స్‌ఛేంజ్ వంటి ఆఫర్లను కూడా యూజ్ చేస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.5,719కే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ ఏప్రిల్ 7వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంది.


ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. 12 ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ రన్ కానుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. వర్చువల్‌గా ర్యామ్‌ను మరో 4 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోనే ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ ఆధారిత సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఉండే మ్యాజిక్ రింగ్ ఫీచర్‌ను ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్‌లో అందించారు.


ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్‌ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ దీని పక్కభాగంలో ఉంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉండటం విశేషం.


మరోవైపు ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఏఐని సపోర్ట్ చేయనుండటం విశేషం. ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. నాలుగు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?