Infinix Note 30 Series: లాంచ్ అయిన రోజు నుంచి ఛాట్ జీపీటీ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఛాట్ జీపీటీ మరో అడుగు వేయడానికి సిద్ధం అయింది. Infinix తన నోట్ 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో Chat GPTకి సపోర్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజం అయితే అది కచ్చితంగా సంచలన వార్త అవుతుంది.
ఇప్పటి వరకు ఏ మొబైల్ కంపెనీ కూడా ఈ పని చేయలేదు. కంపెనీ తన ఫోలాక్స్ వాయిస్ అసిస్టెంట్‌లో చాట్ జీపీటీని అందించనుందని తెలుస్తోంది. Google దాని స్వంత గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నట్లే, Infinix కూడా వాయిస్ అసిస్టెంట్‌ను అందించే దాని స్వంత ఫోలాక్స్ యాప్‌ను క్రియేట్ చేసింది.
ఇన్‌ఫీనిక్స్ లాంచ్ చేయనున్న ఫోన్‌లో Chat GPT నిజంగా కనిపిస్తే, అది Google, Siri, Bixby లకు ఆందోళన కలిగించే విషయం. అయితే కంపెనీకి ఒక సవాలు ఏమిటంటే ఫోన్‌కి Chat GPTని తీసుకువస్తే, ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే విధంగా Bing లాగా దాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాట్ జీపీటీ నాలెడ్జ్ డేటాబేస్ ఆధారంగా రూపొందించబడింది మరియు ఇది 2021 వరకు ఉన్న డేటాను మాత్రమే వినియోగదారులకు తెలియజేయగలదు.
ఎలా పని చేస్తుంది
వీడియోలో యూజరర్ తన కుమార్తె కోసం బహుమతిని సూచించమని ఫోలెక్స్‌ను కోరినట్లు మీరు చూడవచ్చు. దీనికి ప్రతిస్పందనగా, ఈ చాట్ జీపీటీ తరహాలో అదే సమాధానాన్ని ఇస్తుంది. Infinix folexలో ఛాట్ జీపీటీకి సపోర్ట్ చేస్తే, Bing తర్వాత వ్యక్తులు ఒకే క్లిక్‌తో దీన్ని యాక్సెస్ చేయగలగడం ఇది రెండోసారి.
iOS కోసం Chat GPT యాప్‌ను ఓపెన్ ఏఐ ఇప్పటికే ప్రారంభించింది. అయితే ఇప్పటికీ Android వినియోగదారులు దీన్ని Bing లేదా వెబ్‌సైట్ ద్వారా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే కంపెనీ Android కోసం యాప్‌ను ఇంకా రూపొందించలేదు.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.5,999గా నిర్ణయించారు. ఇంక్ బ్లాక్, జేడ్ వైట్, సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!