హువావే నోవా 9 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ మలేషియాలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. హువావే నోవా 9 ఎస్ఈలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 108 మెగాపిక్సెల్ కెమెరా ఇందులో అందుబాటులో ఉంది.


హువావే నోవా 9 ఎస్ఈ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర 1,099 రింగెట్లుగా (సుమారు రూ.20,000) ఉంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం అయ్యాయి. ఇది మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. క్రిస్టల్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, పెరల్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


హువావే నోవా 9 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ హువావే నోవా 9 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఈఎంయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ హువావే ఫుల్ వ్యూ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ 270 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 66W హువావే సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా... బరువు 191 గ్రాములుగా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీంతోపాటు గ్రావిటీ సెన్సార్, కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, జీపీఎస్, ఏజీపీఎస్, బైదు, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?