How to Transfer E-Sim: ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజలు కూడా కొత్త టెక్నాలజీలకు సులభంగా అలవాటు పడుతున్నారు. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే సిమ్ కార్డ్ కూడా దీనికి ఉదాహరణ. ఇంతకుముందు ఫిజికల్ సిమ్ కార్డ్ మాత్రమే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు కొంతమంది ఈ-సిమ్ కార్డును ఉపయోగించడం ప్రారంభించారు. ఈ డిజిటల్ యుగంలో ప్రైవసీ, సెక్యూరిటీ కోసం ఫిజికల్ కంటే ఈ-సిమ్ కార్డు ఉత్తమం.


ప్రస్తుతం భారతదేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ-సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కానీ క్రమంగా దాని వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. భారతదేశంలోని మూడు పెద్ద టెలికాం కంపెనీలు ఈ-సిమ్ సౌకర్యాన్ని అందిస్తాయి. యాపిల్ చాలా కాలంగా తన ఐఫోన్‌లో ఈ-సిమ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఇది కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఆండ్రాయిడ్‌తో ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటంటే వినియోగదారులు ఈ-సిమ్‌ను ఒక మొబైల్ నుంచి మరొక మొబైల్‌కి సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయలేరు. దీని కోసం వారు మాన్యువల్‌గా మెసేజ్‌లను పంపడం ద్వారా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే ఇదంతా త్వరలో మారనుంది.


గూగుల్ కూడా ఆండ్రాయిడ్ 14 నుంచి ఆండ్రాయిడ్ డివైసెస్ కోసం కూడా ఈ ఆప్షన్‌ను అందిస్తుంది. ఇంతకుముందు ఈ ఫీచర్ పిక్సెల్ ఫోన్లకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఇది ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.


ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం ఒక యూజర్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాని సెటప్ చేస్తున్నప్పుడు, అతని ఎల్జీ వీ60 థింక్‌కి ఈ-సిమ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను చూసారు. అంతేకాకుండా గెలాక్సీ ఫోన్ల నుంచి గూగుల్ పిక్సెల్ డివైసెస్‌కు ఈ-సిమ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు శాంసంగ్ వన్ యూఐ 5.1 అప్‌డేట్‌ను విడుదల చేసినప్పుడు శాంసంగ్ ఫోన్ల మధ్య ఈ-సిమ్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ శాంసంగ్ యొక్క కొత్త అప్‌డేట్‌లో మార్చారు. ఇప్పుడు నాన్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఈ-సిమ్‌ని మరొక డివైస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.


ఈ-సిమ్‌ను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి మీరు కొత్త ఫోన్ నుంచి పాత ఫోన్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ సిమ్ కార్డు కొత్త ఫోన్‌లో యాక్టివ్ అవుతుంది. ప్రాసెస్ పూర్తయ్యే వరకు మీ పాత డివైస్‌లో సిమ్ కార్డుని ఉపయోగించవచ్చు.


మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో ఈ-సిమ్ ట్రాన్స్‌ఫర్ గురించి గూగుల్ చెప్పింది. ఇప్పుడు శాంసంగ్ నుంచి ఇతర డివైసెస్‌లో ఈ ఆప్షన్‌ను పొందడం అంటే కంపెనీ దానిని క్రమంగా అందరికీ అందజేస్తుంది. ప్రస్తుతం ప్రజలు పిక్సెల్ నుంచి పిక్సెల్‌కు, శాంసంగ్ కొత్త ఫోన్లలో కూడా ఈ ఆప్షన్‌ను పొందుతున్నారు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!