Independence Day 2024 Stickers: భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రేపు (ఆగస్టు 15వ తేదీ) జరుపుకుంటుంది. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన సందర్భంగా దేశవ్యాప్తంగా కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరూ ఈ జాతీయ పండుగను జరుపుకుంటారు. ప్రజలు తమ కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉన్నప్పటికీ వాట్సాప్ ద్వారా శుభాకాంక్షలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాట్సాప్ స్టిక్కర్ల ద్వారా కూడా వినూత్నంగా ఇండిపెండెన్స్ డే విషెస్ పంపవచ్చు. 


ఈ ప్రత్యేక సందర్భంలో వాట్సాప్ ద్వారా భారతీయ వినియోగదారులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవచ్చు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాట్సాప్ స్టేటస్ వీడియోల ద్వారా మన మెసేజ్‌ని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ కన్వే చేయవచ్చు. కాబట్టి మీరు స్వాతంత్ర్య దినోత్సవ స్టేటస్ వీడియోలను ఎక్కడ పొందవచ్చో తెలుసుకుందాం.


స్వాతంత్ర్య దినోత్సవం కోసం ప్రత్యేక వీడియో స్టేటస్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవసరమైన యాప్‌ను వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసి 'హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2024 వాట్సాప్ వీడియో' అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు చాలా స్టేటస్ యాప్స్ కనిపిస్తాయి. వినియోగదారులు వాటిలో అత్యుత్తమ రేటింగ్ ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.


మీరు వీడియోను చేసి స్టోరేజ్ వాడకూడదు అనుకుంటే ఇందులో కనిపించే షేర్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ స్టేటస్‌లో వీడియోను డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయవచ్చు. దీని వల్ల మీ ఫోన్ స్టోరేజ్ కూడా ఏమాత్రం పెరగదు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


ఇది కాకుండా వినియోగదారులు వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ యాప్స్‌ను కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'Status Saver' లేదా 'Status Downloader' వంటి యాప్‌లను పొందుతారు. ఈ యాప్‌లను ఉపయోగించడానికి మీరు వాట్సాప్ స్టేటస్‌కు యాక్సెస్ ఇవ్వాలి. దీని తర్వాత మీకు కావలసిన స్వాతంత్ర్య దినోత్సవ వీడియోను ఎంచుకుని 'డౌన్‌లోడ్' బటన్‌పై క్లిక్ చేయండి.


మీరు ఆన్‌లైన్ టూల్స్‌ను కూడా వాడచ్చు
ఇవన్నీ కాకుండా వినియోగదారులు కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు, సాధనాల నుంచి వాట్సాప్ స్టేటస్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే స్టేటస్‌ వీడియోను డౌన్‌లోడ్ చేసే ముందు, సైట్‌లు సరైనవా కాదా అన్నది ఒక్కసారి నిర్ధారించుకోండి. లేకపోతే కొన్ని సైట్‌ల నుంచి వైరస్‌లు మీ డివైస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇది మీకు చాలా హాని కలిగిస్తుంది.


వాట్సాప్ స్టిక్కర్స్ ఎలా పంపాలి?
అదే విధంగా వాట్సాప్ స్టిక్కర్స్ ద్వారా ఇండిపెండెన్స్ డే విషెస్ పంపుకోవచ్చు. దీని కోసం వాట్సాప్ స్టిక్కర్లను అందించే కొన్ని యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐఫోన్ యూజర్లు అయితే ఆండ్రాయిడ్ ఫోన్ వాడే స్నేహితుల నుంచి స్టిక్కర్స్ పంపుకుని వాటిని ఫేవరెట్స్‌లో యాడ్ చేసుకోవచ్చు.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?