How to record WhatsApp Call: వాట్సాప్ అనేది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. దీనిని భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. మెసేజ్‌లు పంపడం, ఆడియో లేదా వీడియో కాల్స్ చేయడం వంటి పనుల కోసం ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు.


2009లో వాట్సాప్ లాంచ్ అయింది. అప్పటి నుంచి ఈ యాప్‌లో అనేక అప్‌డేటెడ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. టెక్స్ట్ మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, స్టేటస్ ఫీచర్, పేమెంట్ ఆప్షన్ వంటి ఫీచర్లు దీన్ని బాగా పాపులర్ చేశాయి.


వాట్సాప్ కాల్స్‌ను రికార్డ్ చేయడం సాధ్యమేనా?
చాలా మంది వినియోగదారులు వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేయాలనుకుంటున్నారు. కానీ వాట్సాప్ కాల్స్‌ను రికార్డ్ చేయడం సాధ్యమేనా లేదా అనేది తెలియదు. ఒకవేళ చేయగలిగితే దాన్ని ఎలా చేయవచ్చు? వాట్సాప్ దాని యాప్‌లో ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఆప్షన్‌ను అందించలేదని మీకు తెలియజేద్దాం.


కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించి వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేయడం సాధ్యమే. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ప్రైవసీ, సెక్యూరిటీ కోసం కాల్ రికార్డింగ్‌ని లిమిట్ చేసి దాని కోసం కొన్ని నియమాలను సెట్ చేసినందున ఇవి అన్ని డివైస్‌ల్లో పని చేస్తాయని అనుకోలేం. మీరు వాట్సాప్ కాల్స్‌ను రికార్డ్ చేయగల కొన్ని థర్డ్ పార్టీ యాప్‌ల గురించి, ఎలా రికార్డింగ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!


థర్డ్ పార్టీ యాప్స్ ఇవే...
క్యూబ్ ఏసీఆర్ (Cube ACR): ఈ ఫేమస్ కాల్ రికార్డింగ్ యాప్ వాట్సాప్ కాల్స్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కాల్స్‌ను కూడా రికార్డ్ చేయగలదు.
సేల్స్‌ట్రయల్(Salestrail): ఇది ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం కాల్ రికార్డింగ్ యాప్.
ఏసీఆర్ కాల్ రికార్డర్ (ACR Call Recorder): ఇది చాలా విస్తృతంగా ఉపయోగించే యాప్. ఈ యాప్ ఇంటర్‌ఫేస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించడం చాలా సులభం.


వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలా?
స్టెప్ 1: క్యూబ్ ఏసీఆర్, సేల్స్‌ట్రయల్, ఏసీఆర్ కాల్ రికార్డర్ వంటి యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 2: ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు అవసరమైన అనుమతులను కూడా ఇవ్వాలి.
స్టెప్ 3: తర్వాత కొన్ని యాప్స్‌లో మీరు కాల్ రికార్డింగ్‌ని మాన్యువల్‌గా ప్రారంభించాల్సి రావచ్చు.
స్టెప్ 4: ఈ సెటప్‌ల తర్వాత యాప్ మీ వాట్సాప్ కాల్స్‌ను స్టార్ట్ వెంటనే వాటిని ఆటోమేటిక్‌గా రికార్డ్ చేయడం ప్రారంభిస్తుంది.
స్టెప్ 5: కాల్ ముగిసిన తర్వాత మీరు యాప్‌లో రికార్డింగ్‌ని వినవచ్చు.


Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!