TS E-Challan Payment: తెలంగాణ పోలీసు శాఖ పెండింగ్ చలాన్ల భర్తీకి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెండింగ్ చలాన్లలో ద్విచక్ర వాహనం దారులైతే 25 శాతం, ఆర్టీసీ డ్రైవర్లు 30 శాతం, కార్లు, లారీలు, జీపులు... ఇలా హెవీ వాహనాలు అయితే 50 శాతం మొత్తం కడితే సరిపోతుంది. అయితే ఈ అవకాశం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉండనుంది. అయితే ఈ చలాన్లను ఆన్‌లైన్‌లో ఎలా క్లియర్ చేసుకోవాలి?


దీనికి ప్రధానంగా రెండు దారులు ఉన్నాయి. మొదటిది తెలంగాణ ఈ-చలాన్ వెబ్‌సైట్‌లో కట్టాలి. రెండోది పేటీయం యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా చెల్లించడం.


తెలంగాణ ఈ-చలాన్ వెబ్‌సైట్‌లో క్లియర్ చేయడం ఎలా?
1. ముందుగా ‘https://echallan.tspolice.gov.in/publicview/’ వెబ్ సైట్‌కు వెళ్లాలి.
2. అక్కడ ‘Vehicle No’ అని ఉన్న చోట మీ బండి నంబర్‌ను ఎంటర్ చేయాలి.
3. దాని పక్కనే ‘Engine/Chassis last 4 digits’ అనే కాలమ్‌లో మీ ఆర్సీ బుక్‌పై ఉండే ఇంజిన్ లేదా చాసిస్ నంబర్‌లో చివరి నాలుగు అంకెలను అక్కడ ఇవ్వాలి.
4. ఆ తర్వాత పక్కనే ఉన్న Captcha ఫిల్ చేసి ఎంటర్ చేయగానే మీ బండిపై ఉన్న పెండింగ్ చలాన్లు అన్నీ కనిపిస్తాయి.
5. రాయితీ పోగా... మిగిలిన మొత్తమే అక్కడ కనిపిస్తుంది. మీరు క్లియర్ చేయాలనుకున్న చలాన్ ముందు చెక్ బాక్స్ కనిపిస్తుంది.
6. ఎన్ని చలాన్లు క్లియర్ చేయాలనుకుంటున్నారో... అన్ని చలాన్లను సెలక్ట్ చేసుకోవాలి.
7. ఆ తర్వాత కింద క్రెడిట్/డెబిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్లు ఉంటాయి. 
8. వాటిలో మీరు ఎలా నగదు చెల్లించాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకుని చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు.


పేటీయంలో క్లియర్ చేయడం ఎలా?
1. పేటీయం యాప్ లేదా వెబ్‌సైట్‌లో మొదట లాగిన్ అవ్వాలి. 
2. ఓపెన్ అవ్వగానే పైన కనిపించే సెర్చ్ బార్‌లో Challan అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
3. అక్కడ మీకు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన చలాన్ ఆప్షన్లు కనిపిస్తాయి.
4. అందులో తెలంగాణను ఎంచుకోండి.
5. దాని మీద క్లిక్ చేయగానే మీకు మరో విండో ఓపెన్ అవుతుంది.
6. అక్కడ మీ బండి నంబర్ ఎంటర్ చేయాలి.
7. కింద మీకు పెండింగ్ చలాన్లు కనిపిస్తాయి.
8. ఈ-చలాన్ వెబ్ సైట్ తరహాలోనే క్రెడిట్/డెబిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్లతో నగదు చెల్లించవచ్చు.
9.  మీ పేటీయం వాలెట్‌లో నగదు ఉంటే ఆ పద్ధతిలో కూడా పేమెంట్ చేయవచ్చు.


ఎక్కువ మంది చలాన్లు కడుతూ ఉండటం కారణంగా అప్పుడప్పుడూ సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ‘తొందర పడకండి. చలాన్ క్లియర్ చేసుకోవడానికి నెలాఖరు వరకు సమయం ఉంది.’ అని వెబ్ సైట్లోనే పేర్కొంది.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!