Mancherial Crime News : తెలంగాణ మంచిర్యాల(Mancherial) జిల్లా చెన్నూర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నూర్ మండలం ఓత్కుపల్లి గ్రామానికి చెందిన జాడి సారయ్య, మల్లేశ్వరి భార్య భర్తలు. గత కొన్ని సంవత్సరాల నుంచి భర్త సారయ్య తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా మద్యం సేవించి భార్య మల్లేశ్వరిని వేధించాడు. దీనిని భరించలేని మల్లేశ్వరి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు భర్త నిద్రపోతున్న సమయంలో కళ్లలో కారం(Chilli Powder) కొట్టి నెత్తిపై కర్రతో బలంగా కొట్టింది. దీంతో సారయ్య మరణించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో చెన్నూర్ సీఐ ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. 


శ్రీకాకుళంలో భర్యను చంపిన భర్త


శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో మరో విషాద ఘటన జరిగింది. జిల్లాలోని సానివాడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి భర్యను కీరాతకంగా హత్య చేశాడో భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివరాత్రి(Shiva Ratri) సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామస్తులు స్థానిక ఆలయంలో నిర్వహించే పూజల్లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే గ్రామానికి చెందిన పొన్నాడ నవీన్‌కుమార్, భార్య కల్యాణి మధ్య గొడవ జరిగింది. కల్యాణిని ఉపవాస దీక్ష చేయమని ఆడపడుచు అలేఖ్య సూచించింది. దానికి కల్యాణి ఒప్పుకోలేదు. ఈ విషయమై నవీన్‌కుమార్‌, కల్యాణి దంపతుల మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరిగి క్షణికావేశంలో మంచంపై ఉన్న కల్యాణిపై నవీన్ కుమార్ దాడి చేసి తలగడతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. తర్వాత శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌(Police Station)లో లొంగిపోయాడు. 


ఉపవాస దీక్ష విషయంలో గొడవ


అక్కపై ప్రేమాభిమానాలే హత్యకు దారితీశాయా అనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్ కుమార్ తమ్ముడు మృతిచెందాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను నవీన్ కోల్పోయాడు. అప్పటి నుంచి అక్క అలేఖ్య బాగోగులను నవీన్‌కుమార్‌ చూసుకునేవాడు. కోటబొమ్మాళి మండలం మంచాలపేట గ్రామానికి చెందిన పంచిరెడ్డి ఎర్రన్నాయుడుతో 2021లో అలేఖ్య వివాహం జరిగింది. అలేఖ్య గర్భం దాల్చడంతో ఏడో నెల సీమాంతం కోసం స్వగ్రామం తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరుగుతోంది. కల్యాణికి ఆడపడుచు అలేఖ్య మధ్య గొడవలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు. మంగళవారం రాత్రి కల్యాణి, అలేఖ్య మధ్య ఉపవాస దీక్ష విషయమై తగాదా జరిగింది.  ఈ విషయాన్ని కల్యాణి తన భర్త నవీన్‌కుమార్‌కు చెప్పగా ఇద్దరికి సర్దిచెప్పాడు. ఆ తర్వాత భార్యభర్తలిద్దరి మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో కోపంలో కల్యాణిని నవీన్‌కుమార్‌ తలగడతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.