How To Know WiFi Password In Laptop: వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణ విషయం. ప్రత్యేకించి మీరు కొత్త డివైజ్ కనెక్ట్ చేయవలసి వచ్చినప్పుడు లేదా మీ నెట్‌వర్క్‌ను ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాల్సి వచ్చినట్లు కాస్త ఇబ్బంది పడతారు. మీ ల్యాప్‌టాప్ గతంలో నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే, మీరు మీ రూటర్‌ను రీసెట్ చేయాల్సిన అక్కర్లేదు. లేదా మీ ఇంటర్నెట్ ప్రొవైడర్‌కు కాల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా వైఫై పాస్‌వర్డ్ రిట్రీవ్ చేసుకోవచ్చు.  

Continues below advertisement

Windows ల్యాప్‌టాప్, Mac ల్యాప్‌టాప్‌లు రెండూ సేవ్ చేసిన Wi-Fi పాస్‌వర్డ్‌లను స్టోర్ చేస్తాయి. కొన్నిసార్లు పాస్‌వర్డ్ మరిచిపోవడంతో కొంత టైమ్ వేస్ట్ అవుతుంది. పాస్‌వర్డ్ ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అయితే మీ వైఫై పాస్‌వర్డ్‌ను ఈజీగా కనుగొనవచ్చు. మీరు యాక్సెస్‌ను తిరిగి పొందేందుకు లేదా ఇతరులతో షేర్ చేసుకోవడానికి అప్పుడు పాస్‌వర్డ్‌ను రిట్రీవ్ చేసి వారికి షేర్ చేయవచ్చు. 

Windows ల్యాప్‌టాప్‌లలో ఇలా చేయండి

Step 1: నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి

అక్కడ టాస్క్‌బార్‌లో మీరు Wi-Fi సింబల్‌పై క్లిక్ చేసి “నెట్‌వర్క్ & ఇంటర్నెట్ సెట్టింగ్‌లు” ఎంచుకోవాలి.

Continues below advertisement

Step 2: నెట్‌వర్క్ అండ్ షేరింగ్ సెంటర్‌కు వెళ్లండి

కిందికి స్క్రోల్ చేసి “నెట్‌వర్క్ అండ్ షేరింగ్ కేంద్రం”పై క్లిక్ చేయాలి. ఇది మీ ల్యాప్‌టాప్ కనెక్ట్ అయిన లేదా సేవ్ చేసిన అన్ని నెట్‌వర్క్‌లను మీకు చూపుతుంది.

Step 3: మీ Wi-Fi నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి

“కనెక్షన్‌లు” పక్కన ఉన్న యాక్టివ్ Wi-Fi నెట్‌వర్క్ పేరుపై క్లిక్ చేయాలి. తరువాత ఒక చిన్న విండో తెరుచుకుంటుంది.

Step 4: వైర్‌లెస్ ఫీచర్లను వీక్షించండి

“వైర్‌లెస్ క్యారెక్టర్స్”పై క్లిక్ చేసి సేఫ్టీ ట్యాబ్‌కు వెళ్లండి. ఇక్కడ, మీరు “అక్షరాలను చూపించు” ఎంపికను చూడవచ్చు. దానిని టిక్ చేయగా మీ Wi-Fi పాస్‌వర్డ్ వెల్లడి అవుతుంది. అంతే సింపుల్‌గా మీరు వైఫై పాస్‌వర్డ్ గుర్తించారు.

Mac ల్యాప్‌టాప్‌ల కోసం (macOS):

Step 1: కీచైన్ యాక్సెస్‌ను తెరవండి

అప్లికేషన్స్ > యుటిలిటీస్ > కీచైన్ యాక్సెస్ కు వెళ్లండి.

Step 2: మీ Wi-Fi నెట్‌వర్క్‌ను గుర్తించాలి

సెర్చ్ బార్‌లో Wi-Fi నెట్‌వర్క్ పేరు కోసం సెర్చ్ చేయండి. వివరాలను ఓపెన్ చేయడానికి దానిపై రెండుసార్లు క్లిక్ చేయండి.

Step 3: పాస్‌వర్డ్‌ను చూపించు

“పాస్‌వర్డ్‌ను చూపించు” (Show Password)ని టిక్ చేయండి. మీ Mac బుక్ లాగిన్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలని అడుగుతుంది. అది పూర్తయిన తర్వాత మీకు Wi-Fi పాస్‌వర్డ్ కనిపిస్తుంది.

మీరు మీ రూటర్‌లో పాస్‌వర్డ్‌ను కూడా చెక్ చేయవచ్చు, సాధారణంగా లేబుల్‌పై ముద్రించి ఉంటుంది లేదా బ్రౌజర్ ద్వారా రూటర్ అడ్మిన్ ప్యానెల్‌లోకి లాగిన్ అవ్వాలి. మీరు మీ నెట్‌వర్క్‌ను చాలా పరికరాలు లేదా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాల్సి వస్తే ఇది సహాయపడుతుంది.

మీరు ఎక్కడ చూడాలి అని తెలిస్తే ల్యాప్‌టాప్‌లో మీ Wi-Fi పాస్‌వర్డ్‌ను గుర్తించడం మరింత తేలిక అవుతుంది. పైన తెలిపిన విధంగా అటు విండోస్ ఓఎస్ ఉన్న ల్యాప్‌టాప్, మ్యాక్ ల్యాప్‌టాప్‌లలో మీ పాస్‌వర్డ్‌ను ఈజీగా గుర్తించి.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయవచ్చు.