Whatsapp in Smart Watch: ప్రస్తుతం ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు తమ ఫోన్‌లలో మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ చాలా మంది వినియోగదారులకు తమ స్మార్ట్‌వాచ్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇప్పటికీ తెలియదు. వేర్ ఓఎస్ (Wear OS) సాయంతో మీరు ఫోన్ లేకుండా స్మార్ట్‌వాచ్‌లో సులభంగా చాట్ చేయవచ్చు. దీని కోసం మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి.
స్మార్ట్‌వాచ్‌లో వాట్సాప్ ఇలా...
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి వేర్ ఓఎస్ యాప్‌ని సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ తర్వాత యాప్‌ని ఓపెన్ చేసి మీ స్మార్ట్‌వాచ్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేయడానికి స్క్రీన్‌పై వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవ్వండి. ఇది కాకుండా వినియోగదారుల సౌలభ్యం కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని కంపెనీల వాచీల కోసం ప్రత్యేక యాప్‌లను కూడా చూడవచ్చు.
దీని తర్వాత మీ వేర్ ఓఎస్ స్మార్ట్‌వాచ్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ని తెరవండి. ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ కోసం సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఒకవేళ అందులో మీకు వాట్సాప్ కనిపించకపోతే, మీ స్మార్ట్ వాచ్ వాట్సాప్‌ను సపోర్ట్ చేయడం లేదని అర్థం. దీని కారణంగా ఈ ఫీచర్ ఇందులో పని చేయకపోవచ్చు.
Also Read: మాంచి కెమెరా ఫోన్ కావాలా? ఇవిగో ఈ ఫోన్లు ట్రై చెయ్యండి.. రూ.30 వేలకే అదిరిపోయే ఆప్షన్స్
వాట్సాప్‌ను ఎలా సెటప్ చేయాలి?
స్మార్ట్ వాచ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. దీని తర్వాత మీకు స్మార్ట్‌వాచ్‌లో 8 అంకెల కోడ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీనిలో మీరు అకౌంట్‌కు ఈ డివైస్ జోడించాలనుకుంటున్నారా అని రిక్వెస్ట్ వస్తుంది. దీని తర్వాత మీరు కనెక్ట్ ఆప్షన్‌పై నొక్కాలి. అనంతరం మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆ 8 అంకెల కోడ్‌లను నమోదు చేయాలి.
స్మార్ట్ వాచ్‌లో వాట్సాప్ ఎలా పని చేస్తుంది?
స్మార్ట్ వాచ్‌లో వాట్సాప్‌ను సెటప్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు మీ మెసేజ్‌లు, చాట్‌లు కనిపిస్తాయి. మీరు దానిని ఓపెన్ చేయడం ద్వారా కూడా చాట్‌ను తెరవవచ్చు. మెసేజ్‌కి రిప్లై ఇవ్వడానికి, మీరు రిప్లైని నొక్కాలి. కొత్త మెసేజ్ పంపడానికి, మీరు "+" ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆపై సెండ్‌పై క్లిక్ చేయాలి. అంతే మీ మెసేజ్ సెండ్ అవుతుంది.
స్మార్ట్ వాచ్‌లో వాట్సాప్‌ను సెటప్ చేసిన తర్వాత మీరు మెసేజ్‌లను చదవడానికి, పంపడానికి దాన్ని ఉపయోగించవచ్చు. కానీ వాట్సాప్‌లో మీరు కాల్‌లు లేదా వీడియో కాల్‌లు చేయలేరు అని గుర్తుంచుకోండి. మొబైల్‌లో మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
Also Read: రియల్‌మీ నార్జో ఎన్63 సేల్ ప్రారంభం - రూ.8 వేలలోపే బడ్జెట్ ఫోన్!