How to Increase Slow Phone Speed: ఫోన్ పాతదయ్యే కొద్దీ దాని స్పీడ్ క్రమక్రమంగా తగ్గుతూ ఉండడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు ఇది మీ ఫోన్‌లో పాత సాఫ్ట్‌వేర్ ఉండటం, ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల జరుగుతుంది. కొన్నిసార్లు ఫోన్ స్టోరేజ్ నిండి ఉండటం వల్ల కూడా జరుగుతుంది. ఇక్కడ మనం ఈ సమస్యను సాల్వ్ చేయడానికి కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మీ ఫోన్ వేగంగా పని చేయడం ప్రారంభిస్తుంది.
అవసరం లేని యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి
మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా అందులో ప్రీ ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్స్ మీకు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంది. దాని కారణంగా మీ ఫోన్ పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. దీని కోసం అవసరం లేని ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం ముఖ్యం.
యాప్ కాష్‌ని (cache) తొలగించడం మర్చిపోవద్దు
కొన్నిసార్లు మీ ఫోన్ రన్ అవుతున్నప్పుడు స్లో అవడం, షట్ డౌన్ కావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ స్పీడ్ మెయింటెయిన్ చేయడానికి అందులో ఉండే యాప్స్‌కు సంబంధించిన కాష్‌ని క్రమం తప్పకుండా తొలగిస్తూ ఉండండి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
ఫోన్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి
మీ ఫోన్ నెమ్మదిగా పని చేస్తుందంటే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడమే దీనికి కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ స్లో అయినప్పుడల్లా ఏదైనా కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ వచ్చిందో లేదో చెక్ చేయండి. అప్‌డేట్ ఏదైనా కనిపిస్తే వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
ఫ్యాక్టరీ రీసెట్ కూడా ముఖ్యం
మీ స్మార్ట్‌ఫోన్ చాలా నెమ్మదిగా రన్ అవుతుంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయడం చాలా ముఖ్యం. అయితే మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడు దానికి ముందుగా ఫోన్ బ్యాకప్ తీసుకోండి. దీన్ని చేయాలంటే సెట్టింగ్స్‌కు వెళ్లి ఆపై బ్యాకప్ & రీసెట్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీకు ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆపై రీసెట్ ఫోన్‌కి వెళ్లి ఎరేస్ ఎవ్రీథింగ్‌పై క్లిక్ చేయండి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే