కొత్త సంవత్సరం సందర్భంగా స్పాటిఫై మూడు నెలల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. కేవలం డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రాబోయే మూడు నెలలకు దీన్ని ఉచితంగా అందించనున్నారు.


ఇప్పటివరకు స్పాటిఫై ప్రీమియం ఉపయోగించని వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఒకవేళ మీరు గతంలో స్పాటిఫై ప్రీమియం వాడి ఉంటే ఈ ఆఫర్ మీకు వర్తించదు. దీన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అయితే మీరు మూడు నెలల పాటు దీన్ని ఉచితంగా ఉపయోగించాక ప్రారంభంలో అందించిన పేమెంట్ మెథడ్‌ను రిమూవ్ చేయండి. లేకపోతే నాలుగో నెలకు సబ్‌స్క్రిప్షన్ రుసుము మీ ఖాతా నుంచి ఆటో డెబిట్ అయ్యే అవకాశం ఉంది.


స్పాటిఫై ప్రీమియంను ఉచితంగా పొందడానికి మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవే!
స్టెప్ 1: మీ స్మార్ట్ ఫోన్‌లో స్పాటిఫై యాప్‌ను తెరవండి.
స్టెప్ 2: కింద భాగంలో కుడివైపు ఉన్న ప్రీమియంపై క్లిక్ చేయండి.
స్టెప్ 3:GET 3 MONTHS FOR ₹0 పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: కంటిన్యూ చేయడానికి లాగిన్ లేదా సైన్ అప్ చేయాలి.
స్టెప్ 5: మీ కార్డు యాడ్ చేసి ఆఫర్‌ను పొందండి.


(ఒకవేళ మీరు ఐఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే సఫారీ లేదా క్రోమ్ వంటి బ్రౌజర్లను ఉపయోగించాలి. ఎందుకంటే యాపిల్ తన యాప్ వెండర్ల నుంచి ఇన్ యాప్ పర్చేజెస్‌కు ఎక్స్‌ట్రా చార్జ్‌లను వసూలు చేస్తుంది. అందుకే స్పాటిఫై మెంబర్‌షిప్‌ను మీరు ఐఫోన్ యాప్ ద్వారా కొనుగోలు చేయలేరు.)


ఈ ప్రీమియం ప్లాన్‌లో చాలా అదనపు లాభాలు ఉన్నాయి. మీరు యాడ్స్ లేకుండా మ్యూజిక్ వినవచ్చు. అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. హైక్వాలిటీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. 320 కేబీపీఎస్ వద్ద మీ ఫేవరెట్ పాటలను వినవచ్చు.