WhatsApp Tips: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా పాపులర్ యాప్. ఈ యాప్ ద్వారా మీరు మీ కాంటాక్ట్‌లకు టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలను కూడా పంపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యాప్‌లో మీడియా షేరింగ్ కూడా జరుగుతుంది కాబట్టి యాప్ చాలా స్టోరేజీని కూడా తీసుకుంటుంది. దీన్ని చాలా మంది పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు. కొన్ని సార్లు మీ స్టోరేజ్ చాలా వేగంగా ఫుల్ అయిపోతుంది. కానీ బాధపడకండి. ఎందుకంటే చాలా సింపుల్‌గా స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయవచ్చు.  దానికి కింద తెలిపిన టిప్స్ ఫాలో అయితే చాలు.


డేటాను తొలగించే ఇలా చేయండి


ఏదైనా డేటాను తొలగించే ముందు ఆ డేటా మీ ఫోన్‌లో ఎంత స్టోరేజ్‌ను తీసుకుందో చెక్ చేయండి. వాట్సాప్ డేటాను చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.


1. స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ తెరవండి.
2. ఇప్పుడు సెట్టింగ్స్‌కు వెళ్లండి.
3. దీని తర్వాత స్టోరేజ్, డేటాపై క్లిక్ చేయండి.
4. ఇందులో Manage storage సెక్షన్‌కు వెళ్లండి.
5. మీ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ మీడియా ఎంత స్టోరేజ్‌ను ఉపయోగించిందో ఇక్కడ చూడవచ్చు.


WhatsApp మీడియాను రివ్యూ చేయడం, డిలీట్ చేయడం ఎలా?
స్టోరేజ్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకున్నారు కదా. దీని తర్వాత మీరు మీడియాను రివ్యూ చేయవచ్చు. దీని ద్వారా మీరు పెద్ద ఫైల్స్ లేదా తరచుగా ఫార్వార్డ్ అయిన డాక్యుమెంట్స్‌ను తొలగించవచ్చు. ఇది కాకుండా మీరు మీడియాను కూడా తొలగించవచ్చు. దీని కోసం క్రింద తెలిపిన స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.


1. వాట్సాప్‌లో Manage storage సెక్షన్‌లో Larger than 5 MBపై క్లిక్ చేయండి. దీంతోపాటు మీరు నిర్దిష్ట చాట్‌ను కూడా ఎంచుకోవచ్చు.
2. అదే సమయంలో మీ సౌలభ్యం ప్రకారం Newest, Oldest or Largest ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.
3. ఇది పూర్తయిన తర్వాత మీరు ఏదైనా ఒకటి లేదా బహుళ మీడియా ఫైల్స్‌ను ఎంచుకోవచ్చు, వాటిని తొలగించవచ్చు.


ఒకవేళ మీరు WhatsApp నుండి ఈ ఫైల్స్‌ను తొలగించినపట్పికీ ఇవి ఫోన్ స్టోరేజ్‌లో ఉండవచ్చు. ఈ సందర్భంలో మీరు వాటిని గ్యాలరీ నుంచి కూడా తొలగించాలి.


సెర్చ్ ద్వారా డిలీట్ చేయడం ఎలా?


వాట్సాప్ ఇటీవలే సెర్చ్ ద్వారా డిలీట్ చేసే ఆప్షన్ కూడా తీసుకువచ్చింది.


1. ఇందుకోసం వాట్సాప్ చాట్స్ ట్యాబ్‌ను ఓపెన్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయండి.
2. దీని తర్వాత ఫోటో, వీడియో లేదా డాక్యుమెంట్ కోసం సెర్చ్ చేసి దాన్ని సెలక్ట్ చేయండి.
3. ఆపై మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ఆప్షన్‌ను ఓపెన్ చేయండి.
4. ఆ తర్వాత Moreని ఓపెన్ చేసి అక్కడ డిలీట్‌పై నొక్కండి.


ఈ టిప్స్‌ను ఫాలో అయ్యి మీ ఫోన్‌లో స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇంపార్టెంట్ డేటా డిలీట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి,