iPhone 5G Support: 5జీ భారతదేశంలోని అనేక నగరాల్లో ఇప్పటికే ఉంది. అనేక నగరాల్లో అందుబాటులోకి రాబోతోంది. యాపిల్ తన 5జీ అప్‌డేట్‌ను ఇటీవలే అందించింది. మీరు 5జీ సేవలు ప్రారంభం అయిన నగరంలో నివసిస్తూ 5జీ సపోర్ట్ చేసే ఐఫోన్ ఉపయోగిస్తుంటే, మీరు కూడా 5జీని ఆస్వాదించవచ్చు. మీరు Airtel, Jio 5జీని ఉపయోగించవచ్చు. Airtel, Jio నెట్‌వర్క్‌లలో 5జీ సేవను ఎలా యాక్టివేట్ చేయాలో చూడండి.



ఈ ఐఫోన్ మోడల్స్ 5Gని సపోర్ట్ చేస్తాయి
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 14 ప్రో
ఐఫోన్ 14 ప్లస్
ఐఫోన్ 14
ఐఫోన్ ఎస్ఈ 2022
ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 13 ప్రో
ఐఫోన్ 13
ఐఫోన్ 13 మినీ
ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 12 ప్రో
ఐఫోన్ 12
ఐఫోన్ 12 మినీ


Airtel 5జీని ఇలా ఎనేబుల్ చేయండి.
మీరు 5జీకి సపోర్ట్ Airtel సిమ్ కార్డ్‌ని కలిగి ఉండి, 5జీ నెట్‌వర్క్ ప్రాంతంలో నివసిస్తున్నారా? అయితే 5జీ ఎనేబుల్ చేయడానికి, మీ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను 5జీకి మార్చాలి. ఇది కాకుండా మీరు మీ డివైస్‌లో 5జీ మద్దతును తనిఖీ చేయాలనుకుంటే, మీరు ఎయిర్‌టెల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ యాప్ 100% సరైన సమాచారాన్ని అందించలేకపోయినా 5జీకి అప్‌డేట్ చేయడానికి, మీరు కింద చెప్పిన స్టెప్స్‌ను అనుసరించవచ్చు.


మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
ఇక్కడ మొబైల్ డేటాపై నొక్కండి.
దీని తర్వాత మొబైల్ డేటా ఎంపికపై క్లిక్ చేయండి.
ఇప్పుడు వాయిస్ & డేటాకు వెళ్లండి.
ఇక్కడ 5జీని ఆన్ చేయడానికి టోగుల్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు మీ స్టేటస్ బార్‌లో 5జీ నెట్‌వర్క్ సూచికను చూడటం ప్రారంభిస్తారు.


Jio 5జీని ఇలా ఎనేబుల్ చేయండి
Jio ఇప్పటికీ తన 5జీ టెస్టింగ్‌ని అనేక ఏరియాల్లో చేస్తోంది. అయితే Jio 5జీ సర్వీస్ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే. 'Jio 5జీ వెల్‌కమ్ ప్రోగ్రామ్'లో భాగమైన వారు 5జీ మద్దతు ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ వేగాన్ని పొందుతారు. వినియోగదారులు 5జీకి సంబంధించిన సమాచారాన్ని పొందడానికి Jio యాప్‌ని ఉపయోగించవచ్చు.