మీరు ఎప్పుడైనా ప్రయాణాల్లో వెళ్లేటప్పుడు ఆఫ్‌లైన్‌లో చూడటానికి సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎంతో బెటర్. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఇవి ఉపయోగపడతాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులో ఉంటాయి. వీటిని మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్ట్రీమ్ చేయవచ్చు.
నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేయడం ఎలా?
నెట్‌ఫ్లిక్స్‌లో మీరు ఏదైనా సినిమాను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే యాప్‌లో మీకు కావాల్సిన సినిమా లేదా సిరీస్ ఓపెన్ చేయాలి. అక్కడ కింద మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మీకు ల్యాప్‌టాప్‌లో కావాలనుకుంటే విండోస్ 10 లేదా 11 ఆపరేటింగ్ సిస్టంలకు నెట్‌ఫ్లిక్స్ యాప్ లభిస్తుంది. ఆ యాప్‌లో మీరు పై స్టెప్స్ ఫాలో అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
అమెజాన్ ఫైర్ ట్యాబ్లెట్, ఐవోఎస్, ఆండ్రాయిడ్, మ్యాక్ఓఎస్, విండోస్ 10లకు అమెజాన్ ప్రైమ్ యాప్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో టైటిల్స్‌ను ఆఫ్‌లైన్‌లో చూడటానికి మీరు ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో మీకు కావాల్సిన సినిమా, సిరీస్ ఓపెన్ చేసి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డిస్నీప్లస్ హాట్‌స్టార్
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఉండే కంటెంట్‌ను మీరు ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోలేరు. ఎందుకంటే హాట్‌స్టార్‌కు విండోస్ యాప్ లేదు. అయితే మొబైల్స్, ట్యాబ్లెట్స్‌కు యాప్ ఉంది కాబట్టి అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!