రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ మనుషులకు ఎంత లాభం చేకూర్చుతుందో? అంతకు మించి నష్టం కలిగిస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంఫుల్ హిడెన్ కెమెరాలు. హోటళ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలు అమర్చిన ఘటనలు ఇప్పటి వరకు చాలా చూశాం. తరుచుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే న్నాయి. హిడెన్ కెమెరాలు చాలా చిన్నగా ఉంటాయి. బాత్ రూముల్లో, హోటల్ గదుల్లో, ట్రయల్ రూమ్స్ లో ఎక్కడ అమర్చినా తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే వాటిని పట్టించుకోం. ఫలితంగా ప్రైవేట్ విజువల్స్ ఆకతాయిల చేతికి వెళ్లి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకే హోటల్, షాపింగ్ మాల్స్, బాత్ రూమ్స్ ఉపయోగించే సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. హిడెన్ కెమెరాలు ఉన్నాయేమో పరిశీలించాలి.


గది లైట్లు ఆర్పివేసి పరిశీలించండి


చాలా వరకు రహస్య కెమెరాలను నైట్ విజన్ సెక్యూరిటీ కెమెరాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. కొన్ని హిడెన్ కెమెరాలు గ్రీన్ లేదా, రెడ్ ఎల్ఈడీ లైట్లను కలిగి ఉంటాయి. ఈ లైట్లు కెమెరా ఆన్ లో ఉంటే మెరుస్తూ కనిపిస్తాయి. కాబట్టి, మీరు ఉండే గదిలో లైట్స్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత గదిని క్షుణ్ణంగా పరిశీలించాలి. హిడెన్ కెమెరాలు ఉన్నట్లయితే ఎల్ఈడీ లైట్లు మెరుస్తూ కనిపిస్తాయి. వెంటనే వాటిని పట్టుకునే అవకాశం ఉంటుంది. కెమెరాలు ఎక్కడెక్కడ రహస్యంగా అమర్చారో గుర్తించవచ్చు.  


మొబైల్ ఫోన్లతోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు  


ఎవరికి వారు తమ మొబైల్ ఫోన్లతోనూ హిడెన్ కెమెరాలను కనుగోనే అవకాశం ఉంటుంది. రహస్య కెమెరాలు రేడియో ఫ్రీక్వెన్సీలను జనెరేట్ చేస్తాయి. కాబట్టి మీరు వాడే ఫోన్ తో అలాంటి కెమెరాలను గుర్తించవచ్చు. ఒక వేళ మీకు రహస్య కెమెరా ఉందని అనుమానం కలిగితే ఫోన్ మాట్లాడుకుంటూ అనుమానాస్పద ప్రాంతాల దగ్గరికి వెళ్లాలి. రేడియో ఫ్రీక్వెన్సీ కారణంగా మీ ఫోన్ కాల్ సరిగా పనిచేయదు. వాయిస్ స్పష్టత కోల్పోతుంది. అంటే, అక్కడ రహస్య కెమెరా ఉందని గుర్తుపట్టవచ్చు.   


IR లైట్‌ తో హిడెన్ కెమెరాల గుర్తింపు 


రహస్య కెమెరాలు IR లైట్‌ని ఉత్పత్తి చేస్తాయి. అది కంటికి కనిపించదు. మీరు మీ ఫోన్‌ను సదరు కెమెరాలు ఉన్నాయనే అనుమానం కలిగిన ప్రదేశానికి దగ్గరగా తీసుకెళ్తే, దానిపై ఉన్న కెమెరా ఇన్‌ఫ్రారెడ్ లైట్‌ను క్యాప్చర్ చేయగలదు.  మీ కెమెరా డిస్‌ ప్లే నీలం-తెలుపు కాంతిని చూపుతుంది. దీంతో అక్కడ హిడెన్ కెమెరా ఉన్నట్లు గుర్తించ వచ్చు.  


వైఫై స్కాన్ ద్వారా రహస్య కెమెరాలను గుర్తించే అవకాశం   


మీ ఫోన్‌లోని Wi-Fi ఆన్ చేస్తే, కొన్ని రహస్య కెమెరాలు ఆ లిస్టులో కనిపించే అవకాశం ఉంటుంది. అందులో మీకు ఏదైనా అనుమానస్పదమైన లింక్స్ లేదా పేర్లు, కెమేరా కంపెనీ పేరు కనిపించినట్లయితే వెంటనే పైన చెప్పినవి ఫాలో అయిపోండి. ఏదో ఒక విధానాన్ని అనుసరించి రహస్య కెమేరాలను కనుగొనండి.


Read Also: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?