ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీ పేరు మార్మోగుతోంది. లక్షల సంఖ్యలో వినియోగారులను సంపాదించుకుంటూ దూసుకెళ్తోంది. ప్రీ ట్రైనింగ్ తో దేని గురించైనా మనుషులకు కావాల్సినట్లుగా మాట్లాడుతుంటుంది. గ్రామర్ మిస్టేక్స్ సరి చేయడం, ఇతర భాషల్లోకి ట్రాన్స్‌ లేట్ చేయడం, ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పడం, ప్రోగ్రామ్స్ రాయడం, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమస్యలను ఈజీగా సాల్వ్ చేయడం చాట్ జీపీటీ ప్రత్యేకత. అందుకే ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అవుతోంది. చాట్ జీపీటీ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ కు వినియోగదారులు అబ్బురపడుతున్నారు. కేవలం 5 రోజుల్లోనే ఏకంగా 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకుని వారెవ్వా అనిపించింది. ప్రస్తుతం ఆ సంఖ్య 20 లక్షలకు పైగా చేరింది. ఇంతకీ చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఎందుకు అంత క్రేజ్ నెలకొంది?  


ఇంతకీ చాట్ జీపీటీ అంటే ఏంటి?


చాట్ జీపీటీ అంటే ‘జెనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్’ గా నిర్వచించారు. ఇది అచ్చం గూగుల్ మాదిరిగానే వ్యవహరిస్తోంది. గూగుల్ లో మనం ఆయా విషయాల గురించి ఎలా సెర్చ్ చేస్తామో? ఇక్కడ కూడా అలాగే వెతికే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రన్ అవుతుంది. 2021కి ముందున్న సమచారం మొత్తాన్ని ఇందులో పొందుపరిచారు. 2021కి ముందు జరిగిన ఏ విషయం గురించైనా ఇట్టే చెప్పేస్తోంది. చాట్ జీపీటీ సాంకేతిక విప్లవం ముందు గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలే వణికిపోతున్నాయి. నవంబర్ 30, 2022లో ఈ చాట్ జీపీటీ ప్రారంభం అయ్యింది.  


గూగుల్ కి చాట్ జీపీటీకి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏంటి?  


చాట్ జీపీటీ అనేది కూడా గూగుల్ మాదిరిగానే సెర్చింజన్. అయితే, రెండింటి మధ్య ఓ వ్యత్యాసం ఉంది. గూగుల్ లో ఓ విషయాన్ని సెర్చ్ చేస్తే పదుల కొద్ది లింక్స్ వస్తాయి. మనకు ఏది అవసరమో దాన్నే వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ, చాట్ జీపీటీ పూర్తి భిన్నంగా ఉంటుంది. మీరు ఏ ప్రశ్న అడుగుతారో.. దానికి కచ్చితమైన సమాధానం చెప్తుంది. లింకులు, వెతుక్కోవడాలు ఉండవు. అందుకే దీనికి చాలా మంది వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు.  


చాట్ జీపీటీని ఎలా వాడాలి?


ముందుగా OPENAI.COM ఓపెన్ చేయాల్సి ఉంది. మీకు అకౌంట్ ఉంటే లాగిన్ కావాలి. లేదంటే కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి. మీ గూగుల్, మైక్రోసాఫ్ట్ అకౌంట్లతోనూ లాగిన్ అయ్యే అవకాశం ఉంది. లాగిన్ అయ్యాక ఓ సెర్చ్ బార్ కనిపిస్తుంది. దానిలో మీకు కావాల్సిన సమాచారానికి సంబంధించిన ప్రశ్న టైప్ చేయగానే సమాధానం నేరుగా కనిపిస్తోంది. మీకు కావాల్సిన సమచారాం పక్కగా కనిపిస్తుంది. 2021కి ముందు జరిగిన అన్ని విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన అంశాలకు సంబంధించిన సమాచారం అంత పక్కగా ఉండదు.


చాట్ జీపీటీతో లాభ నష్టాలు ఏంటి?


చాట్ జీపీటీతో చాలా ఉపయోగాలున్నాయి. చదువులకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు  కష్టమైన కోడ్స్ కి ఈజీగా సమాధానం చూపిస్తోంది. ఏ ప్రశ్న అడిగినా కచ్చితమైన సమాచారం త్వరగా అందిస్తోంది. సమాధానాలు సూటిగా సుత్తిలేకుండా లభిస్తున్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల ఈజీగా సమాధానాలు దొరుకుతున్నాయి. అందువల్ల మనుషుల్లో క్రియేటివిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది.  మొత్తంగా చాట్ జీపీటీ రానున్న కాలంలో టెక్ ప్రపంచానికి రారాజుగా నిలిచే అవకాశం ఉంది.


Read Also: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA