Block Calls From Unknown Numbers: కొన్నిసార్లు మనం బిజీగా ఉన్నప్పుడు కొత్త నంబర్ల నుంచి కాల్స్ వస్తే చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది. గత కొంతకాలంగా స్పామ్ కాల్స్ కూడా మొబైల్ నంబర్స్ నుంచే వస్తున్నాయి. కొంతమంది కొత్త నంబర్ నుంచి కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయరు. కానీ పనిలో ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్లు వస్తే చిరాకు పుడుతుంది. దీనికి ఆండ్రాయిడ్‌లో(Android) మంచి ఆప్షన్ ఉంది. తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ను పూర్తిగా బ్లాక్ చేయవచ్చు. వేర్వేరు యూజర్ ఇంటర్‌ఫేస్‌ల్లో దీనికి వేర్వేరు పద్ధతులు ఉన్నాయి.
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొత్త నంబర్ నుంచి వచ్చే కాల్స్‌ను పూర్తిగా బ్లాక్ చేయడానికి కింద తెలిపిన స్టెప్స్ ఫాలో అవ్వండి. గూగుల్ పిక్సెల్ ఫోన్ లేదా గూగుల్ ఫోన్ యాప్ ఇన్‌స్టాల్ అయిన ఫోన్లలో ఎలా బ్లాక్ చేయాలో ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత శాంసంగ్, షియోమీ ఫోన్లలో ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం.. వన్‌ప్లస్ నార్డ్ 5జీ, నోకియా స్మార్ట్ ఫోన్లు, మోటో స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ఫోన్ యాప్‌ను అందిస్తారు. దీంతోపాటు మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా గూగుల్ ఫోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గూగుల్ ఫోన్ (Google Phone) యాప్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్‌లో తెలియని నంబర్లు బ్లాక్ చేయడం ఎలా?
1. ముందుగా ఫోన్ యాప్ ఓపెన్ చేయండి.
2. డయలర్ సెర్చ్ బార్‌కు వెళ్లి కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేయండి.
3. సెట్టింగ్స్‌కు వెళ్లి బ్లాక్డ్ నంబర్లను ఎంచుకోండి.
4. అక్కడ ‘Unknown’ ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేయండి.
ఇక్కడ ఆండ్రాయిడ్‌లో ‘Unknown’ అంటే మీ కాంటాక్ట్స్‌లో సేవ్ కాని నంబర్లు అని అర్థం. అదే ఐఫోన్‌లో అయితే ‘private' లేదా ‘unknown' అనేవి వారి కాలర్ ఐడీపై ఆధారపడి ఉంటాయి.
శాంసంగ్ (Samsung) ఫోన్లలో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయడం ఎలా?
1. ముందుగా ఫోన్ యాప్ ఓపెన్ చేయండి.
2. అక్కడ మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయండి.
3. ఓపెన్ అయిన డ్రాప్ బాక్స్‌లో బ్లాక్ నంబర్స్‌పై క్లిక్ చేయండి.
4. అందులో ‘Block unknown/ hidden numbers’ను ఎంచుకోండి.
ఎంఐ/రెడ్‌మీ/పోకో (Redmi/Mi/Poco) ఫోన్లలో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయడం ఎలా?
1. ఫోన్ యాప్ ఓపెన్ చేయండి.
2. సెర్చ్ బార్‌లో మూడు చుక్కల బటన్‌పై క్లిక్ చేయండి.
3. మెనూలో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
4. కొత్త నంబర్ల వర్చే కాల్స్ బ్లాక్ చేయడానికి ‘Unknown’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!