జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ లేదా జియో ఫైబర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లు జియో ఫైబర్‌కు అందుబాటులో ఉన్నాయి. 30 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్ వరకు అందించే ప్లాన్లు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అందించనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ యాప్స్‌కు కూడా ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. దీంతో ప్రస్తుతం ఎయిర్‌టెల్, యాక్ట్ ఫైబర్‌నెట్, బీఎస్ఎన్‌ఎల్‌కు ఇది గట్టిపోటీని ఇవ్వనుంది.


జియో బ్రాడ్‌బ్యాండ్‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా?
1. జియోఫైబర్ రిజిస్ట్రేషన్ వెబ్‌పేజీకి వెళ్లాలి.
2. అక్కడ మీ మొబైల్ నంబర్ ఇచ్చి... ఓటీపీని జనరేట్ చేయాలి.
3. మీ స్మార్ట్ ఫోన్‌కు వచ్చే ఆరు అంకెల వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) అక్కడ ఎంటర్ చేసి... వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయాలి.
4. మీకు ఎక్కడ జియోఫైబర్ కనెక్షన్ కావాలో ఆ అడ్రెస్‌ను ఎంటర్ చేయాలి.
5. సబ్మిట్‌పై క్లిక్ చేయండి.


మీరు ఈ వివరాలన్నీ అందించాక... మీ మొబైల్ నంబర్‌కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం కావాల్సిన అన్ని పత్రాలను మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ సర్వీస్‌కు ఆధార్ కార్డు లేదా ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్ అవసరం.


ప్రస్తుతం ట్రాయ్ నివేదిక ప్రకారం... బీఎస్ఎన్ఎల్‌ను సైతం దాటేసి దేశంలో అతి పెద్ద వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా జియో ఫైబర్ నిలవనుంది. దాదాపు 43.4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు జియో ఫైబర్‌కు ఉన్నారు. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు రూ.2,097 నుంచి ప్రారంభం కానున్నాయి.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!