Best WiFi Speed For Home: ఇప్పుడు ఇంట్లో వైఫై అనేది చాలా కామన్ అయిపోయింది. కొత్తగా వైఫై పెట్టించుకునే వారిలో చాలా మందికి తమ ఇంటికి ఎంత స్పీడ్ ఉండే ప్లాన్‌ని ఎంచుకోవాలి అనే ప్రశ్న ఉంటుంది. అది ఎయిర్ ఫైబర్ ప్లాన్ అయినా లేదా సాధారణ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్ అయినా ఎంత ఎంబీపీఎస్ అనే ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు అయోమయంలో పడి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీ అవసరాలను బట్టి ఎంత ఎంబీపీఎస్ ప్లాన్ బెస్టో చూద్దాం.
ఇంట్లో మనందరికీ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు మొదలైన వాటికి ఇంటర్నెట్ అవసరం. మీరు కూడా ఈ గాడ్జెట్‌లన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జనరల్ యూసేజ్ కోసం ఇంటర్నెట్ ప్లాన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే 10 నుండి 30 ఎంబీపీఎస్ వరకు ఫైబర్ ప్లాన్, 30 ఎంబీపీఎస్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ మీకు ఉత్తమంగా ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!
30 ఎంబీపీఎస్ ప్లాన్‌లో కంప్యూటర్, నాలుగు నుంచి ఐదు మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ టీవీ మొదలైనవాటిని సులభంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నార్మల్ వినియోగం కోసం మీరు 30 ఎంబీపీఎస్ ప్లాన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మీరు మంచి డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ పొందుతారు. అలాగే ఈ ప్లాన్ ప్రయోజనం ఏమిటంటే ఇది మీ జేబుపై ఎక్కువ భారం వేయదు. మీరు రూ. 500 కంటే తక్కువ ధరకు 30 ఎంబీపీఎస్ ప్లాన్‌ని పొందవచ్చు.
మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్‌ని ఉపయోగిస్తున్నా ఈ రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉంటుంది. మీ ఇంట్లో స్టూడియో ఉంటే లేదా కంప్యూటర్లలో వర్క్ చేసుకునేలా అయితే మీరు 50 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు ప్లాన్‌ను తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ స్పీడ్ కావాలనుకుంటే అది మీ పర్సనల్ యూసేజ్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇంటర్నెట్ స్పీడ్‌ని ఎలా చెక్ చేయాలి
మీ ఇంటర్నెట్ వేగాన్ని చెక్ చేయడానికి మీరు స్పీడ్ టెస్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ మీరు డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగం రెండింటినీ చూడవచ్చు. దీని వల్ల మీకు ఎంత ఇంటర్నెట్ స్పీడ్ అవసరం అవుతుందో ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవచ్చు.
Also Read: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?