Honda Amaze Facelift New Look: హోండా అమేజ్ కొత్త లుక్ రివీల్ అయింది. ఈ కారును చూస్తుంటే ఇది హోండా సిటీకి కాస్త చిన్న వెర్షన్ అని తెలుస్తోంది. హోండా అమేజ్ లుక్‌లో వాహన తయారీ కంపెనీ పెద్ద మార్పు చేసింది. అంతే కాదు ఇప్పటి వరకు హోండా అమేజ్‌ను తయారు చేస్తున్న ప్లాట్‌ఫారమ్‌ను కూడా మార్చారు. ఈ కారు కూడా సిటీ ప్లాట్‌ఫారమ్‌పై తయారు అయింది. అమేజ్ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి ముందు నుంచి హోండా ఎలివేట్ లాగా కనిపిస్తుంది.
హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ లుక్ ఎలా ఉంది?
హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ సిటీని పోలి ఉండటమే కాకుండా ఈ కారు కలర్ కూడా అలానే ఉంటుంది. ఈ కారు అబ్సిడియన్ బ్లూ పెర్ల్ కలర్‌లో వస్తుంది. ఇది హోండా అమేజ్ కోసం కొత్త కలర్ వేరియంట్. ఈ కొత్త కారును డిసెంబర్ 4వ తేదీన మార్కెట్లో లాంచ్ చేయనున్నారు.
Also Read: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ కారులో ఎలివేట్ తరహాలో పెద్ద గ్రిల్ అమర్చారు. దీంతో పాటు స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు కూడా చూడవచ్చు. దీని కారణంగా ఈ కారు దాని పాత మోడల్ కంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఈ హోండా కారు సైడ్ ప్రొఫైల్ కూడా మెరుగుపడింది. దీని కారణంగా ఇది పూర్తిగా సెడాన్ లాగా కనిపిస్తుంది.
కొత్త అమేజ్ ఇంజిన్ ఎలా ఉంది?
కొత్త హోండా అమేజ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించనున్నారని తెలుస్తోంది. ఈ ఇంజన్‌లో సీవీటీ, మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఏడీఏఎస్ ఫీచర్‌తో ఈ కారు మార్కెట్లోకి రావచ్చు. ఈ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్ అందిస్తున్న మొదటి కారు ఇదే. ఈ కారు లోపలి భాగం కూడా ఎలివేట్ లానే ఉంటుంది. కానీ ఈ సెడాన్‌లోని టచ్‌స్క్రీన్ సిటీ లేదా ఎలివేట్ కంటే కొంచెం చిన్నది. సెడాన్ కార్ల కొనుగోలుదారులకు హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మంచి ఆప్షన్‌గా మారవచ్చు.
Also Read: స్కోడా కైలాక్ రేటు రివీల్ అయ్యేది అప్పుడే - డెలివరీ ఎప్పుడు వస్తుంది?