Honor X9b Launched: హానర్ ఎక్స్9బీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. 4 ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ ఎక్స్9బీ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. 6.78 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రైమరీ కెమెరాగా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 35W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


హానర్ ఎక్స్9బీ ధర
ఈ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్లోనే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధరను రూ.25,999గా నిర్ణయించారు. మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. అమెజాన్‌తో పాటు దేశవ్యాప్తంగా 1,800 రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనేయచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 డిస్కౌంట్ లభించనుంది. 


హానర్ ఎక్స్9బీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం 4 ఎన్ఎం 6 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ ఎక్స్9బీ రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు అందుబాటులో ఉన్నాయి. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5800 ఎంఏహెచ్ కాగా, 35W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.


మరోవైపు గతంలో మనదేశంలో లాంచ్ అయిన హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వెనక వైపు 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ అందుబాటులో ఉంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా హానర్ అందించనుంది. హానర్ 90 5జీ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.37,999గా ఉండగా, తర్వాత దీన్ని రూ.27,790కు తగ్గించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999 కాగా, ఇప్పుడు రూ.26,850కే అందుబాటులో ఉంది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?