Honor 100 Pro: హానర్ 100 సిరీస్ స్మార్ట్ ఫోన్ నవంబర్ 23వ తేదీన విడుదల కానుంది. హానర్ 100, హానర్ 100 ప్రో మోడల్స్‌ లాంచ్ కానున్నాయి. లాంచ్‌కు ముంగిట ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ దీనికి సంబంధించిన ఫీచర్లను లీక్ చేశారు. ఇందులో 1.5కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేలు అందించనున్నారు. లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై హానర్ 100 పని చేయనుందని తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ‘డిజిటల్ ఛాట్ స్టేషన్’ దీనికి సంబంధించిన వివరాలు లీక్ చేశారు. నవంబర్ 17వ తేదీన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కంపెనీ లాంచ్ చేసింది.


హానర్ 100 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై పని చేయనుందని సమాచారం. హానర్ 90 ప్రో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. హానర్ 100 సిరీస్ ఫోన్లు రెండిట్లోనూ 100W ఛార్జింగ్ సపోర్ట్, ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి.


నవంబర్ 23వ తేదీన హానర్ 100, హానర్ 100 ప్రో ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక రెండర్లను కూడా కంపెనీ ఇప్పటికే పోస్ట్ చేసింది. హానర్ 100లో వెనకవైపు రెండు కెమెరాలు, హానర్ 100 ప్రోలో మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్‌కు సంబంధించి ఇంతవరకు ఎటువంటి వివరాలు తెలియరాలేదు. హానర్ 90 ఇప్పటికే మనదేశంలో లాంచ్ అయింది కాబట్టి హానర్ 100 సిరీస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!


హానర్ 90 సిరీస్‌కి అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా హానర్ 100 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. హానర్ 90 చైనాలో 2,499 యువాన్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.29,100) ధరతోనూ, హానర్ 90 ప్రో 3,299 యువాన్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.38,000) ధరతోనూ లాంచ్ అయింది.


హానర్ ఎక్స్50ఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. హానర్ ఎక్స్50ఐ సిరీస్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 35W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను హానర్ ఎక్స్50ఐ ప్లస్ సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు. ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా (సుమారు రూ.18,600) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగా (సుమారు రూ.20,900) నిర్ణయించారు. క్లౌడ్ వాటర్ బ్లూ, ఫాంటసీ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, లిక్విడ్ పింక్ కలర్ ఆప్షన్లలో హానర్ ఎక్స్50ఐ ప్లస్ కొనుగోలు చేయవచ్చు. హానర్ ఎక్స్50ఐ ప్లస్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.




Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!