Flawed India Map Punishment: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో భారతదేశ పటాన్ని తప్పుగా చూపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు అలాంటి సంఘటనలను ఆపడానికి మార్గాలను పరిశీలిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా కంపెనీల అధికారులు, ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన ముఖ్యమైన సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ఏర్పడిన గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీల (GAC) మొదటి సమావేశంలో ఈ విషయం లేవనెత్తారు.

Continues below advertisement


ఏదైనా టూల్ లేదా ఫిల్టర్ సహాయంతో తప్పుగా ప్రదర్శితం అవుతున్న ఇండియా మ్యాప్‌ను తొలగించడానికి లేదా నిరోధించడానికి కావాల్సిన మార్గాల గురించి ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియా కంపెనీలను అడిగారు. సోషల్ మీడియాలో తప్పుడు ఇండియా మ్యాప్‌లను ప్రదర్శించకుండా నిరోధించడానికి ఏదైనా మార్గం ఉందా అని ఈ అధికారులు అడిగారు.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


తెరపైకి అనేక వివాదాలు
దేశంలోని కొన్ని ప్రాంతాలను తప్పుగా చూపించడం గురించి అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇటువంటి సంఘటనల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఒక మార్గాన్ని వెతుకుతోంది. 2020లో ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) లడఖ్‌ను చైనాలో భాగంగా చూపించినప్పుడు వివాదం చెలరేగింది. దీని తర్వాత 2022లో, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ భారతదేశపు తప్పుడు మ్యాప్‌ను ఉపయోగించారని ఆరోపించారు. దీని తర్వాత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంబంధిత వీడియోను బ్లాక్ చేయాలని ఆదేశించింది.


తప్పుడు మ్యాప్‌ను చూపిస్తే శిక్ష తప్పదు
భారతదేశపు తప్పుడు మ్యాప్‌ను చూపించినందుకు చట్టంలో శిక్ష, జరిమానా నిబంధన ఉంది. ప్రతిపాదిత చట్టంలో దీనికి ఏడు సంవత్సరాల వరకు శిక్ష, రూ. 100 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాతే ఈ బిల్లు చట్టం రూపంలోకి వస్తుంది. 


Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?