WhatsApp Update: వాట్సాప్, గూగుల్ త్వరలో ఛాట్ బ్యాకప్ కోసం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ కోటాను ఎండ్ చేయనున్నాయి. ప్రస్తుతం మీరు వాట్సాప్‌లో ఎంత డేటానైనా బ్యాకప్ చేయవచ్చు. అయితే త్వరలో కంపెనీ దానిని 15 జీబీకి మాత్రమే పరిమితం చేయబోతోంది. అంటే మీకు మీ గూగుల్ అకౌంట్లో ఎంత స్పేస్ ఖాళీ  ఉంటుందో అంత డేటాను మాత్రమే బ్యాకప్ చేయగలరన్న మాట. ఇప్పటి వరకు వాట్సాప్ బ్యాకప్‌ను గూగుల్ స్టోరేజ్‌లో పరిగణించేది కాదు. కానీ ఇకపై అలా ఉండబోదు. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో అప్‌డేట్ చేసింది.


ఉదాహరణకు మీ గూగుల్ అకౌంట్లో లభించే ఉచిత 15 జీబీ స్టోరేజ్‌లో 10 జీబీ ఉపయోగించి, 5 జీబీ ఖాళీగా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం మీరు 20 జీబీ వాట్సాప్ డేటాను బ్యాకప్ చేసినా... మీ 5 జీబీ డేటా అలాగే ఖాళీగా ఉంటుంది. కానీ మారనున్న నిబంధనల ప్రకారం మీరు ఖాళీగా ఉన్న 5 జీబీ వరకు మాత్రమే బ్యాకప్ చేయగలరు. అంతేకాకుండా మీ గూగుల్ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయిపోనుంది.


ఇప్పటికే కంపెనీ ఈ విషయంపై యూజర్లకు యాప్‌లో హెచ్చరికలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ విషయంపై అప్‌డేట్లను వాట్సాప్ హెల్ప్ సెంటర్, గూగుల్ హెల్ప్ సెంటర్‌లో కూడా అందించారు.


ఈ ఛేంజ్ 15 జీబీ కంటే ఎక్కువ డేటా బ్యాకప్ చేసుకునే వారిపై ప్రభావం చూపిస్తుంది. ఛాట్‌ల్లో ఉండే మీడియా, మెసేజ్‌లు మొదలైన వాటిని వారు క్రమం తప్పకుండా బ్యాకప్ చేస్తారు. తక్కువ డేటా బ్యాకప్ చేసేవారికి పర్వాలేదు కానీ ఎక్కువ డేటా బ్యాకప్ చేసేవారికి ఇది సమస్య అవుతుంది. దీనికి ఏకైక పరిష్కారం ఏంటంటే... గూగుల్ వన్ (Google One) సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడమే.


మనదేశంలో గూగుల్ వన్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ రూ.130 నుంచి ప్రారంభం అవుతుంది. దీని ద్వారా 100 జీబీ స్పేస్ లభిస్తుంది. 200 జీబీ స్టాండర్డ్ ప్లాన్‌కు నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2 టీబీ ప్రీమియం ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ.650 ఖర్చవుతుంది.  మీరు డబ్బు ఖర్చు చేయకుండా మీ గూగుల్ ఖాతాలో ఖాళీని సృష్టించాలనుకుంటే, దీని కోసం పనికిరాని ఫైల్‌లను తొలగించాల్సి ఉంటుంది.


డేటా సైజు ఇలా తగ్గించవచ్చు...
1. మీరు వాట్సాప్‌లో డిజప్పియరింగ్ మెసేజ్‌ ఫీచర్‌ను ఆన్ చేయవచ్చు, ఇది మీ బ్యాకప్ పరిమాణాన్ని ఎక్కువగా పెంచదు.
2. మీ వాట్సాప్ మెసేజ్‌లను రివ్యూ చేయండి. మీడియాను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి.
3. వాట్సాప్‌లో మీడియా ఆటో డౌన్‌లోడ్ సెట్టింగ్‌ను కూడా మార్చవచ్చు. తద్వారా ఎక్కువ డేటా పేరుకుపోకుండా ఉంటుంది.


మెటా తన ప్రముఖ ఛాటింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఒక కొత్త ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులు ఏకకాలంలో 128 మంది లైవ్‌లో మాట్లాడగలరు. ఈ ఫీచర్ ఇప్పటి వరకు బీటా వెర్షన్‌లో టెస్టింగ్ దశలో ఉంది. ఇప్పుడు మెటా దీన్ని సాధారణ వినియోగదారుల కోసం కూడా రోల్ అవుట్ విడుదల చేయడం ప్రారంభించింది.


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!