Google Search: గూగుల్‌లో ఏదైనా ప్రశ్నకు సమాధానం వెతికేటప్పుడు ప్రతిసారీ వేరే వెబ్‌సైట్‌ను తెరవాల్సిన అవసరం లేకుండా 'AI ఓవర్వ్యూస్' ద్వారా నేరుగా సెర్చ్ పేజీలోనే యూజర్‌కు కావాల్సింది దొరుకుతుంది. అయితే ఈ AI ఫీచర్ వాడకం పెరగడం వల్ల వినియోగదారులు వెబ్సైట్లకు వెళ్లకుండా నేరుగా ఏఐ ఆన్సర్లు చదివి వెళ్లిపోతుండటంతో, న్యూస్ పబ్లిషర్లు, వెబ్సైట్ నిర్వహకులలో ఆందోళన వ్యక్తమవుతోంది. జులై 2025 నుంచి జులై 2026 మధ్య కాలంలో న్యూస్ వెబ్సైట్లకు గూగుల్ ద్వారా వచ్చే ట్రాఫిక్ భారీగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. వెబ్సైట్ల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. Also Read: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్షిప్ ఫోన్ల లాంచ్.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
ఏఐ సెర్చ్‌లో కీలక మార్పులు
ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఏఐ ఇచ్చే తక్షణ సమాచారానికి, జనరేటెడ్ వెబ్సైట్ల ట్రాఫిక్‌కు మధ్య బ్యాలెన్స్ చేయడానికి గూగుల్ ఏఐ సెర్చ్ రిజల్ట్స్‌లో కీలక మార్పులు చేస్తోంది. కొత్త అప్డేట్ ప్రకారం, ఏఐతో రూపొందించిన డేటాకు సంబంధిత వెబ్సైట్ల లింకులు గతంలో కంటే ఎక్కువగా, కంటెంట్ పైభాగంలో, కంటెంట్ మధ్యలోనే కనిపిస్తాయి. అంతేకాకుండా, సంబంధిత వార్తల ముఖ్యాంశాలు, ఫొటోలతో కూడిన 'లింక్ క్యారౌసెల్'ను గూగుల్ విస్తరిస్తోంది. Also Read: ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
దీనికి తోడు, యూజర్లు గతంలో ప్రాధాన్యత ఇచ్చిన వెబ్సైట్ల వార్తా కథనాలకు గూగుల్ అల్గోరిథం మరింత ప్రాధాన్యత ఇస్తుంది. మే 2024లో ఏఐ ఓవర్వ్యూస్ను, మార్చి 2025లో ప్రత్యేక విండోలో తెరుచుకునే ఏఐ మోడ్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు సోర్స్‌కు తగిన విధంగా చర్యలు తీసుకుంటోంది. Also Read: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
