Simple Tips To Cooling Laptop : ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నప్పుడు.. అకస్మాత్తుగా వేడెక్కడం, ఫ్యాన్ నుంచి పెద్ద శబ్దం రావడం, లేదా స్క్రీన్ ఫ్రీజ్ అవ్వడం వంటివి ఇబ్బందిగా ఉంటాయి. చదువుతున్నా, ఆఫీసు పనులు చేస్తున్నా, లేదా గేమ్స్ ఆడుతున్నా, అధిక వేడి మీ ల్యాప్‌టాప్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఎక్కువకాలం ఇలా వేడెక్కితే.. దానిలోని పార్ట్స్ లైఫ్‌టైమ్ కూడా తగ్గిపోతుంది. అయితే దీనికోసం ప్రతిసారీ కొత్త సాఫ్ట్‌వేర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ ల్యాప్‌టాప్ వాడకాన్ని మార్చుకోవడం, కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేడిని తగ్గించవచ్చు.
మంచం, సోఫాపై వాడకండి..
ల్యాప్‌టాప్‌ను మంచం, సోఫా లేదా దిండుపై ఉపయోగించడం వల్ల దాని గాలి రంధ్రాలు మూసుకుపోయి.. వేడి గాలి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. మెరుగైన గాలి ప్రసరణ కోసం.. దానిని బల్లపై లేదా ఇతర గట్టి, చదునైన ఉపరితలంపై ఉంచండి. ల్యాప్‌టాప్ వెనుక కొంత ఖాళీ స్థలం ఉంచడం కూడా గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
Also Read : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
దుమ్ము పేరుకుపోతే..
కాలక్రమేణా ల్యాప్‌టాప్ వెంట్లు, ఫ్యాన్‌లలో దుమ్ము పేరుకుపోయి.. కూలింగ్‌ను ప్రభావితం చేస్తుంది. అందుకే వెంట్లను శుభ్రం చేయడానికి కంప్రెస్డ్ ఎయిర్‌ను ఉపయోగించవచ్చు. ల్యాప్‌టాప్‌ను తెరిచి లోపలి భాగాన్ని శుభ్రం చేసే ముందు.. దాని డిజైన్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. అవసరమైతే సర్వీస్ సెంటర్ దగ్గరకు తీసుకెళ్లండి.
టాస్క్ మేనేజర్ చెక్ చేయండి..
అనేక ప్రోగ్రామ్‌లు, బ్రౌజర్ ట్యాబ్‌లు, వీడియో ఎడిటింగ్ యాప్‌లు లేదా గేమ్‌లను ఒకేసారి నడపడం వల్ల ప్రాసెసర్‌పై భారం పెరిగి, ల్యాప్‌టాప్ వేడెక్కవచ్చు. అందుకే అవసరం లేని యాప్‌లను మూసివేయండి. ఏ యాప్‌లు ఎక్కువగా రన్ అవుతున్నాయో చూడటానికి టాస్క్ మేనేజర్‌ను చెక్ చేయండి.
Also Read : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
సర్వీసింగ్ బెటర్..
సింపుల్ వర్క్స్ చేస్తున్నప్పుడు కూడా మీ ల్యాప్‌టాప్ వేడెక్కితే.. దాని ఫ్యాన్ లేదా కూలింగ్ సిస్టమ్‌లో సమస్య ఉండవచ్చు. పాత ల్యాప్‌టాప్‌లలో థర్మల్ పేస్ట్ కూడా బలహీనపడి ఉండవచ్చు. అటువంటి సందర్భంలో దానికి సర్వీసింగ్ చేయించడం ఉత్తమం.
మరిన్ని జాగ్రత్తలు
ల్యాప్‌టాప్‌ను చాలా వేడిగా ఉండే గదిలో, నేరుగా సూర్యరశ్మిలో లేదా ఇరుకైన ప్రదేశాలలో ఉపయోగించడం వల్ల అది అతిగా వేడెక్కవచ్చు. దానిని చల్లని ప్రదేశంలో ఉంచండి. కింది భాగం గాలి తగిలేలా చూసుకోండి. ల్యాప్‌టాప్ మరీ వేడెక్కితే.. దాన్ని కొన్ని నిమిషాల పాటు ఆఫ్ చేయండి. అవసరం లేని, అవసరం లేనప్పుడు కొన్ని పరికరాలు డిస్‌కనెక్ట్ చేయండి.
ల్యాప్‌టాప్ స్టాండ్ లేదా కూలింగ్ ప్యాడ్ గాలి ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ ల్యాప్‌టాప్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, దాన్ని సరైన ప్రదేశంలో ఉపయోగించడం, ఉపయోగించని యాప్‌లను తీసివేయడం వంటి చిన్న అలవాట్లు వేడెక్కడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
