Best TVs Under Rs 50K : పండుగ సీజన్‌లో మీరు మీ ఇంటి కోసం కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రాబోయే సేల్స్‌పై కచ్చితంగా ఫోకస్ చేసి ఉంటారు. ఈ రెండు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు.. వివిధ బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలపై ఆఫర్లను అందిస్తాయి. శాంసంగ్, షియోమి, టీసీఎల్ వంటి బ్రాండ్‌లు.. ప్రస్తుత, ఇటీవలి మోడళ్లపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందుబాటులోకి తెచ్చాయి. 

Continues below advertisement

మీ బడ్జెట్ 40,000 నుంచి 50,000 అయితే.. మీ బడ్జెట్‌లో చాలా ఎంపికలు అందుబాటులో ఉంటాయి. అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40,000 లోపే మీరు మంచి టీవీలను ఎంచుకోవచ్చు. మరి వీటిలో టాప్ 5లో ఉన్న టీవీలు ఏంటో.. వాటి ఫీచర్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎంత మొత్తంలో టీవీని తీసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

Also Read : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

Continues below advertisement

హైసెన్స్ టీవీ - HD డిస్‌ప్లే

హైసెన్స్ నుంచి 55 ఇంచుల 55E75Q QLED టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో 41,990కి అందుబాటులో ఉంది. ఇందులో 4K అల్ట్రా HD డిస్‌ప్లే, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్స్, VIDAA OS ఉన్నాయి. ఈ టీవీలో 48W స్పీకర్లు, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్నాయి. ఇది క్రికెట్ మోడ్, గేమ్ మోడ్ ప్లస్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్‌ను కూడా అందిస్తుంది.

షియోమి టీవీ - గేమింగ్​కి బెస్ట్

Xiaomi నుంచి 55-అంగుళాల X 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ 37,999 ధరకు అమెజాన్​లో అందుబాటులో ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD డిస్‌ప్లేను కలిగి ఉంది. గేమింగ్ కోసం 120Hz DLGకి మద్దతు ఇస్తుంది. ఈ టీవీలో డాల్బీ విజన్, HDR10, HLG, MEMC, వైడ్ కలర్ గామట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 14, గూగుల్ టీవీపై పనిచేస్తుంది. ఇందులో 2GB RAM, 8GB స్టోరేజ్, 34W ఆడియో అవుట్‌పుట్ ఉన్నాయి.

Also Read : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?

TCL టీవీ - గూగుల్ బేస్డ్

TCL T6D 43,990కు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్, 178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్స్‌తో కూడిన 55-అంగుళాల 4K QLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీ HDR10+, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది గూగుల్ టీవీపై పనిచేస్తుంది. ఇందులో 2GB RAM, 16GB స్టోరేజ్ ఉంటాయి.

LG టీవీ - ఫిల్మ్ మేకర్ మోడ్

LG NU87 AI సిరీస్ 45,990కి అందుబాటులో ఉంది. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 55 అంగుళాల 4K అల్ట్రా HD డిస్‌ప్లే ఉంది. ఈ టీవీ AI ప్రాసెసర్ 4K జెన్ 9 పై పనిచేస్తుంది. ఇందులో 4K సూపర్ అప్‌స్కేలింగ్, AI HDR రీమాస్టరింగ్, HDR10, ఫిల్మ్‌మేకర్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇది 20W ఆడియో, డాల్బీ అట్మాస్, వెబ్OS 26, 1.5GB RAM, 8GB స్టోరేజ్‌తో వస్తుంది.

Also Read : ఆడపిల్లలకు అద్భుతమైన పోస్టాఫీసు పథకం.. నెలకు 6,000 కడితే.. 4 లక్షలు పొందవచ్చు

శాంసంగ్ టీవీ

శాంసంగ్ 50 అంగుళాల క్రిస్టల్ UHD 4K విజన్ AI టీవీ అమెజాన్‌లో 42,990 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో 4K అల్ట్రా HD స్క్రీన్, క్రిస్టల్ ప్రాసెసర్ 4K, 50Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ టీవీలో HDR10+, 4K అప్‌స్కేలింగ్, ప్యూర్‌కలర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది విజన్ AI కంపానియన్, ఏడు సంవత్సరాల OS అప్‌డేట్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఆడియో అవుట్‌పుట్ 30W.

Also Read : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి