October Smartphones Launch: అక్టోబర్ 12-18 మధ్య స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి భారీగా కొత్త ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. తమ కొత్త మోడళ్లలో మెరుగైన డిస్‌ప్లేలు, పెద్ద బ్యాటరీలు, స్పీడ్ ప్రాసెసర్‌లు, గేమింగ్‌ ఫీచర్లను అందించడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. వన్‌ప్లస్, రెడ్‌మ్యాజిక్ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను చైనాలో లాంచ్ చేస్తున్నాయి. ఒప్పో, మోటరోలా, ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్‌లు భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.  

Continues below advertisement

వన్‌ప్లస్ 16లో సూపర్ ఫీచర్లు

వన్‌ప్లస్ 16 ఇవాళ చైనాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌లో 165Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఉంటుంది. ఇది సెలెక్టెడ్ గేమ్‌లలో 185Hz వరకు ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు సమాచారం. దీని కెమెరాలో 200MP మెయిన్ సెన్సార్‌తో పాటు ఇతర అడ్వాన్స్‌డ్ లెన్స్‌లు ఉంటాయని అంచనా. భారత్‌లో దీని లాంచ్ గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు.

రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ గేమింగ్‌ 

రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ అక్టోబర్ 15న చైనాలో లాంచ్ అవుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్, అండర్-డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా టెక్నాలజీ ఉన్నాయి. స్క్రీన్ బెజెల్స్‌ను మరింత తగ్గించింది కంపెనీ. ఈ ఫోన్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో పవర్‌ఫుల్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇతర స్పెసిఫికేషన్లు లాంచ్ టైమ్‌లో ప్రకటించనున్నారు. Also Read: ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి

Continues below advertisement

ఇతర బ్రాండ్ల ఫోన్‌లు

ఈ లిస్టులో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్, మోటొరొలా ఎడ్జ్ 70 నియో, ఇన్ఫినిక్స్ GT 50 ప్రో వంటి మోడల్స్ కూడా ఉన్నాయి. ఐక్యూ 16,  షామీ బ్రాండ్లు కూడా రానున్న రోజుల్లో కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. Also Read: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!