Google Shortcuts: గూగుల్‌లో ఈ షార్ట్‌కట్స్ వాడుకుంటే సెర్చ్‌లో మీరు తోపులే! ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ అని  మీ తోటి వారు అంటారు!  చాట్‌జీపీటీ లాంటి ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత గూగుల్‌లో సెర్చ్‌ చేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయినా ఇంకా చాలా మంది గూగుల్‌నే నమ్ముకంటున్నారు. నమ్మకమైన ఇన్‌ఫర్మేషన్ కోసం గూగుల్ తల్లిపైనే ఆధారపడుతున్నారు. ఈ ట్రిక్స్ తెలిస్తే మీరు కూడా చాట్‌జీపీటీ మాదిరిగానే గూగుల్‌ను వాడుకోవచ్చు. 

Continues below advertisement

ఇక్కడ మీకు 10కిపైగా గూగుల్ షార్ట్‌కట్స్‌ ఇస్తున్నాం. వాటిని ఎలా ఏ సందర్భాల్లో వాడుకోవచ్చో కూడా తెలియజేస్తున్నాం. ఇవి కేవలం పిడిఎఫ్‌లు, పిపిటీలు, అకడమిక్ పేపర్లను వెతకడం కోసమే కాకుండా న్యూస్ ఆర్టికల్స్‌కు కూడా సరిపోతాయి. ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీరు సెర్చ్‌ హీరో అవుతారు.

filetype:pdf మీరు గూగుల్‌లోకి వెళ్లి ఏదైనా టాపిక్‌ను టైప్ చేసి దానికి చివర్లో ఈ filetype:pdf అని ట్యాగ్‌ను తగిలించండి. దీని వల్ల ఆ టాపిక్‌పై ఉన్న పీడీఎఫ్‌ ఫైల్స్ మాత్రమే కనిపిస్తాయి.   

Continues below advertisement

filetype:ppt ఏదైనా అంశంపై పీపీటీ తయారు చేయాలనుకుంటే కూడా గూగుల్‌లో షార్ట్ కట్ ఉంది. మీకు ఏ అంశంపై పీపీటీ తయారు చేయాలనుకుంటున్నారో టైప్ చేసి దాని వెనకాలే ఈ filetype:ppt అని తగిలించండి. జరిగే అద్భుతాన్ని మీరే చూడండి. 

filetype:docx చాలా మంది రెజ్యుమె తయారు చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. గూగుల్‌లో నేరుగా టైప్ చేస్తే చాలా పెయిడ్ వెర్షన్‌లు వస్తాయి. అలా కాకుండా నేరుగా కాపీ పేస్ట్ చేసుకునేందుకు వీలుగా వర్డ్ డాక్యుమెంట్ కవాలంటే ఈ షార్ట్‌కట్‌ ఉపయోగపడుతుంది. resume template filetype:docx అని టైప్ చేస్తే మీకు కావాల్సిన వివరాలు వస్తాయి.  

site:drive.google.com ఎక్కువ ఫైల్స్ పంపడానికి చాలా మంది గూగుల్ డ్రైవ్‌ను వాడుతుంటారు. అలాంటి ఫైల్స్ గుర్తించడానికి ఈ షార్ట్‌కట్‌ చాలా యూజ్ అవుతుంది. ఈ షార్ట్ కట్ ఉపయోగించేటప్పుడు చివర్లో మీకు కావాల్సిన సబ్జెట్‌ను టైప్ చేయాలి. ఉదాహరణకు site:drive.google.com physics textbook pdf అని టైప్ చేస్తే ఫిజిక్స్ టెక్స్‌ బుక్స్ మీకు కనిపిస్తాయి. వెంటనే వాటిని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. 

site:news.google.com రోజూ కొన్ని లక్షల న్యూస్‌ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతుంటాయి. వాటిలో మీకు కావాల్సిన న్యూస్ వెతుక్కోవడం చాలా కష్టం. కానీ దీనికి కూడా ఓ షార్ట్ కట్ ఉంది. site:news.google.com AI in healthcare అనిటైప్ చేస్తే కేవలం ఈ సబ్జెట్‌పై పబ్లిష్ అని న్యూస్ ఆర్టికల్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి.  

site:gov ప్రభుత్వానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో పెట్టిన పీడీఎఫ్‌లు వెతుక్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అధికారికంగా పెట్టిన పీడీఎఫ్‌లను గుర్తించేందుకు కూడా ఓ షార్ట్‌కట్‌ ఉంది. site:gov పక్కన మీకు కావాల్సిన సమాచారాన్ని టైప్ చేయండి. అంతే ప్రభుత్వం అధికారికంగా ప్రచురించిన పీడీఎఫ్‌ ప్రత్యక్షమవుతుంది.  

site:org ప్రభుత్వం సంస్థలే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక రిపోర్ట్స్‌ను ప్రచురిస్తుంటాయి. వాటిని కనుక్కొనేందుకు కూడా షార్ట్‌కట్ ఉపయోగపడుతుంది. site:org environment report అని టైప్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం స్క్రీన్‌పై చూసుకోవచ్చు.  

site:edu మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే ఎడ్యుకేషన్ సంస్థలు ప్రచురించిన పీడీఎఫ్‌లను కూడా ఈ షార్ట్‌కట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. site:edu research paper economics అని టైప్ చేస్తే మీకు అవసరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. 

allintitle:keyword ఈ షార్ట్ కట్‌తో మీకు కావాల్సిన సమాచారం కీవర్డ్ టైప్‌ చేయాలి. ఫలితంగా మీరు నేరుగా కావాల్సిన ఇన్‌ఫర్మేషన్ మాత్రమే తీసుకునే వీలు కలుగుతుంది. allintitle:latest tech news అని టైప్ చేస్తే ఈ కీవర్డ్‌తో ఉన్న సమాచారం మాత్రమే వస్తుంది. ఇతర టెక్‌ న్యూస్ మీకు కనిపించదు. 

inurl:keyword inurl:keyword అని టైప్ చేస్తే కేవలం యూఆర్‌ఎల్‌లో న్యూస్ అని ఉన్న సమాచారం మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తుంది.  

define:word ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే వెంటనే గూగుల్‌ చేస్తాం. అందులో వందల పదాలు వస్తాయి. ఒకే పదానికి సంబంధించిన వివిధ రకాల అర్థాలు ఇస్తాయి. అయితే define:Eloquent అనిటైప్ చేస్తే ఈ పదానికి అర్థం నేరుగా మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.  

Tools → Time Range ఏదైనా విషయంపై ఇటీవలి కాలంలో వచ్చిన అప్‌డేట్స్ చూడాలంటే గూగుల్‌ ఆ విషయాన్ని టైప్ చేసి టూల్స్‌లోకి వచ్చి టైమ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా మీరు కావాలంటే మాత్రం ఈ టూల్ ఉపయోగపడుతుంది. Tools > Past 6 month టైప్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని టైప్ చేయాలి.    Google Scholarచాలా అంశాలపై రోజూ వందల పరిశోధనలు జరుగుతుంటాయి. వాటి కోసం మీకు సమాచారం కావాలంటే Google Scholar అని టైప్ చేస్తే వేరే సెర్చ్‌ ఇంజిన్ వస్తుంది. అందులో కేవలం అకడమిక్ పేపర్లు, రీసెర్చ్ కంటెంట్ మాత్రమే దొరుకుతుంది. అక్కడ మీకు అవసరమైన టాపిక్‌ చదువుకోవచ్చు. Google Books అనే టూప్‌తో ఫ్రీ టెక్స్ట్‌బుక్స్ వెతుక్కోవచ్చు.  ఇలా గూగుల్ షార్ట్‌కట్స్‌తో మీరు ఏ టాపిక్‌కైనా ఏ రకమైన సమాచారానికైనా సెకన్లలో తెలుసుకోవచ్చు.