టెక్ దిగ్గజం గూగుల్ నుంచి రాబోతున్న పిక్సెల్ 8 సిరీస్ డిస్‌ ప్లే స్పెసిఫికేషన్‌లు తాజాగా లీక్ అయ్యాయి. కంపెనీ ఈ ఏడాది చివర్లో పిక్సెల్ 8,  పిక్సెల్ 8 ప్రో అనే రెండు ప్రీమియం పిక్సెల్ స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేయనుంది. అయితే, రాబోయే పిక్సెల్ స్మార్ట్‌ ఫోన్ల కు సంబంధించిన వివరాలు లాంచ్ కు ముందే లీక్ అయ్యాయి. ఇందులో ప్రధానంగా డిస్ ప్లేకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 8 ప్రోను ఫ్లాట్ స్క్రీన్‌తో లాంచ్ చేస్తుందని తాజా నివేదిక ద్వారా వెల్లడి అయ్యింది.  పిక్సెల్ 8,  పిక్సెల్ 7తో పోలిస్తే కొంచెం చిన్న డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది.


పిక్సెల్ 8 సిరీస్ డిస్‌ ప్లే స్పెసిఫికేషన్లు లీక్


ఆండ్రాయిడ్ అథారిటీ నుంచి విడుదలైన నివేదిక ప్రకారం, గూగుల్ 6.7-అంగుళాల OLED డిస్‌ ప్లేతో పిక్సెల్ 8 ప్రోని విడుదల చేయనుంది. పిక్సెల్ 7 ప్రో మాదిరిగా కాకుండా, పిక్సెల్ 8 ప్రో ఫ్లాట్ డిస్‌ ప్లేతో లాంచ్ అవుతుందని వెల్లడించింది.  డిస్‌ ప్లే మునుపటి కంటే లెస్ స్క్వైర్,  మూలల్లో కొంచెం ఎక్కువ గుండ్రంగా ఉంటుంది. Pixel 7  6.3-అంగుళాల స్క్రీన్‌తో పోలిస్తే Pixel 8 కొంచెం చిన్నగా అంటే, 6.17-అంగుళాల OLED డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. పిక్సెల్ 8 అదే 2,400 x 1,080-పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉండగా, తాజా నివేదిక ప్రకారం, చిన్న డిస్‌ప్లే కారణంగా ఇది ఎక్కువ పిక్సెల్స్ ను (427 PPI) కలిగి ఉంటుంది.  పిక్సెల్ 8 ప్రో,  పిక్సెల్ 7 ప్రో 3,120 x 1,440-పిక్సెల్ రిజల్యూషన్‌కు బదులుగా కొంచెం చిన్నగా అంటే 2,992 x 1,344 రిజల్యూషన్‌తో వస్తుంది.


గూగుల్ రెండు హ్యాండ్‌సెట్‌ల బ్రైట్‌నెస్ స్థాయిలను కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు 1600 నిట్స్ గా ఉండబోతోంది. Pixel 7 సిరీస్, పోల్చి చూస్తే, పీక్ బ్రైట్ నెస్ 1,000 నిట్స్ వరకు అందిస్తుంది. రిఫ్రెష్ రేట్ విభాగంలో కూడా ట్వీక్స్ ఉంటాయని నివేదిక వెల్లడించింది. Pixel 8 10Hz, 120Hz మధ్య రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.  అయితే Pixel 8 Pro దాని రిఫ్రెష్ రేట్లను 5Hz, 120Hz మధ్య కలిగి ఉంటుంది. 


ఇప్పటికే కెమెరా స్పెసిఫికేషన్లు లీక్


గతంలో, ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల కెమెరా  స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రెండు స్మార్ట్‌ ఫోన్‌లు 50-మెగా పిక్సెల్ Samsung GN2 ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటాయి. పిక్సెల్ 8 ప్రో అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 64-మెగాపిక్సెల్ సోనీ IMX787 కెమెరా,  5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48-మెగాపిక్సెల్ Samsung GM5 టెలిఫోటో కెమెరాను కలిగి ఉండబోతోంది. లీక్ వీడియో ప్రకారం, హ్యాండ్‌ సెట్ కెమెరా సెన్సార్ల పక్కన టెంపరేచర్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పిక్సెల్ 8 డ్యూయల్-కెమెరా సెటప్‌ను కొనసాగిస్తుంది. ఇది 0.55x జూమ్ రేషియోతో 12-మెగాపిక్సెల్ సోనీ IMX386 అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. రెండు హ్యాండ్‌సెట్‌లు 11-మెగాపిక్సెల్ Samsung 3J1 సెన్సార్‌తో రానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు రాబోయే Google Tensor G3 SoCని కలిగి ఉండబోతున్నాయి. ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ని బూట్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.


Read Also: వన్‌‌ప్లస్ నార్డ్ 3 వచ్చేస్తుంది - ధర, ఫీచర్లు లీక్!