రోజు రోజుకు ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం భారతీయ ఐటీ మంత్రిత్వ శాఖ సహకారం తీసుకుంటుంది. 


లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులను సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు జరుపుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తో కలిసి పనిచేస్తుంది. ఎలాంటి సైబర్ దాడులకు వీలు లేకుండా, సరికొత్త పద్దతులను అవలంబించేలా ప్రోత్సహించేందుకు Ministry of Electronics and Information Technology(MeitY), డిజిటల్ ఇండియా కార్పొరేషన్ సహకారంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది.   ఆన్ లైన్ వేదికగా జరిగే మోసాల నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  'సేఫర్ విత్ గూగుల్' ఈవెంట్‌ లో  భాగంగా దేశ వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది డెవలపర్‌ లు, IT, స్టార్ట్-అప్ నిపుణుల కోసం.. సైబర్‌ సెక్యూరిటీ అప్-స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ ను ప్రారంభించింది.  మహిళలు, సూక్ష్మ వ్యాపారవేత్తలు, సీనియర్లు, LGBTQ కమ్యూనిటీ వంటి హై-రిస్క్ గ్రూపులకు సాధికారత కల్పించేందుకు కలెక్టివ్ గుడ్ ఫౌండేషన్, పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్ప్ ఏజ్ ఇండియాతో సహా లాభాపేక్ష లేని సంస్థలకు $2 మిలియన్లు  భారత కరెన్సీలో సుమారు రూ. 16 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.


లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులను సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు గూగుల్ తెలిపింది. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ సహకారంతో అన్ని భాషల వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.  భారత్ డిజిటల్ ఎనేబుల్డ్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ భద్రత అనేది చాలా కీలకం అన్నారు గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా. మిలియన్ల మంది భారతీయుల కోసం సురక్షితమైన ఇంటర్నెట్‌ను కల్పించేందుకు భారత ప్రభుత్వంతో కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు తెలిపారు.  దాదాపు 1,00,000 మంది డెవలపర్‌లు, ఐటీ,  స్టార్ట్-అప్ నిపుణులకు ప్రత్యేక టూల్స్, డీటెయిల్డ్ గైడెన్స్, భద్రతతో కూడిన సురక్షితమై యాప్ లను రూపొందించేందుకు సహకరించనున్నట్లు తెలిపింది.  ఇందుకోసం  ఆధునిక ఐటీ సేవలను మొదలుపెడుతున్నట్లు చెప్పింది.   


ఎక్కువ మంది పౌరులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేస్తున్నట్లు National E-Governance Division చీఫ్ అభిషేక్ సింగ్ అన్నారు.  వారి పురోగతి, శ్రేయస్సుకు కీలకమైన చెల్లింపులు, బదిలీలు చేస్తున్నందున.. వారికి రక్షణ కల్పించేందుకు ప్రధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నుంచి దేశ పౌరులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం గూగుల్ తో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించారు.   గూగుల్, భారత ప్రభుత్వం కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల సైబర్ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మూలంగా సురక్షితమైన ఆర్థిక లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుందంటున్నారు.


Also Read: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!