Google Android Security Update: గూగుల్ తీసుకువచ్చిన లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్ పిక్సెల్ వినియోగదారుల సమస్యలను పెంచుతోంది. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు డేటా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిక్సెల్ 6 సిరీస్ నుంచి పిక్సెల్ 9 లైనప్ వరకు ఉపయోగించే వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కోపంతో ఉన్న వినియోగదారులు రెడిట్, గూగుల్ సపోర్ట్ ఫోరంల్లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇక్కడ వివరిస్తున్నారు.


ఓవర్ హీటింగ్ సమస్యలు కూడా...
పిక్సెల్ వినియోగదారులు డేటా కనెక్టివిటీ గురించి మాత్రమే ఆందోళన చెందడం లేదు. అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్ వేడెక్కడం ప్రారంభించిందని, డేటా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కుంటున్నామని పిక్సెల్ 7 వినియోగదారు రెడ్డిట్‌లో పేర్కొన్నారు. గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 9 వినియోగదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో వారి ఫోన్ డేటా కనెక్టివిటీ పదేపదే డిస్‌కనెక్ట్ అవుతుంది. దీని కారణంగా వారు చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ప్రభావితం అవుతున్నాయి.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


ట్రబుల్ షూటింగ్ కూడా...
ఈ సమస్యలతో ఇబ్బంది పడిన కొంతమంది వినియోగదారులు ట్రబుల్ షూటింగ్‌ని ప్రయత్నించారు. కానీ వారు దాన్ని కూడా చేయలేకపోయారు. చాలా మంది పిక్సెల్ వినియోగదారులు తమ మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయడానికి కూడా ప్రయత్నించారని, అయితే దాని వల్ల ఉపయోగం లేకపోయిందని చెప్పారు. మీరు గూగుల్ పిక్సెల్ యూజర్ అయితే మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయాలనుకుంటే ఇది మీ ఫోన్‌లో సేవ్ చేసిన అన్ని వైఫై పాస్‌వర్డ్‌లను తొలగిస్తుంది. అదేవిధంగా బ్లూటూత్ పెయిరింగ్ కూడా మాయం అవుతున్నాయి. 


స్పందించని గూగుల్
గూగుల్ పిక్సెల్ వినియోగదారులు 4జీ/వోల్టే కాలింగ్‌ని నిలిపివేయడం ద్వారా ఈ సమస్య నుండి తాత్కాలికంగా బయటపడవచ్చు. అయితే ఉపశమనం ఏమిటంటే ఈ అప్‌డేట్ తర్వాత పిక్సెల్ పరికరంలో కాలింగ్ ప్రభావితం కాలేదు. అదే సమయంలో దీనిపై గూగుల్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన లేదు. కంపెనీ ఈ సమస్యను గుర్తించలేదు లేదా దాన్ని పరిష్కరించడానికి ఎటువంటి అప్‌డేట్‌నూ విడుదల చేయలేదు.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!