Gemini Nano: టెక్ దిగ్గజం గూగుల్ ఐ/వో 2024 ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్ ద్వారా గూగుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే జెమిని ఏఐ గురించి సమాచారాన్ని అందించింది. స్కామ్ కాల్స్‌ను ఆపడానికి ఇప్పుడు ఏఐ సహాయం తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు గూగుల్ కొత్త ఏఐ ఫీచర్ జెమిని నానో గురించి సమాచారం అందించింది.


స్మార్ట్‌ఫోన్‌ను మరింత శక్తివంతంగా చేసేందుకు జెమిని నానోకు మరిన్ని సామర్థ్యాలను జోడిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం, మీ ఫోన్‌లో ఉన్న జెమిని ఏఐ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంది. ఈ ఫీచర్‌తో యాక్సెసిబిలిటీ ఫీచర్ టాక్‌బ్యాక్‌ను కూడా ప్రమోట్ చేయనుంది. ఇది కళ్లు లేని వినియోగదారులకు ఫోన్‌ను ఉపయోగించడం సులభతరం చేస్తుంది.


జెమిని నానో గురించి గూగుల్ ఏం చెప్పింది?
జెమిని నానో గురించి తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన గూగుల్ రాబోయే నెలల్లో దీనికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రావచ్చని రాసింది. అంటే ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది? వంటి వివరాలన్నిటి గురించి త్వరలో క్లారిటీ రానుందన్న మాట.


Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!


డెవలపర్‌లకు అందుబాటులో...
కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ జెమిని తాజా వెర్షన్ జెమిని 1.5 ప్రోను ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్‌లందరికీ అందుబాటులో ఉంచారు. ఇది 35 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జెమిని 1.5 ప్రో వెర్షన్ ఇప్పుడు వర్క్‌స్పేస్ ల్యాబ్స్‌లో అందుబాటులో ఉంది.


గూగుల్ సీఈవో ఏం చెప్పారు?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలుపుతున్న దాని ప్రకారం జెమిని ఏఐని గూగుల్ వర్క్ స్పేస్‌లోకి తీసుకువస్తున్నారు. ఇది సెర్చ్ ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. జీమెయిల్, గూగుల్ మీట్ వంటి మీ వర్క్‌స్పేస్‌లలో జెమిని ఏఐని తీసుకురావడం వల్ల వినియోగదారులకు చాలా సౌలభ్యం లభిస్తుంది. వారి సమయం కూడా ఆదా అవుతుంది.


Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!