Xiaomi Smart Speaker IR Control: కొత్త స్మార్ట్ స్పీకర్ లాంచ్ చేసిన షావోమీ - ఎలా ఉందో చూశారా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ మనదేశంలో స్మార్ట్ స్పీకర్‌ను లాంచ్ చేసింది.

Continues below advertisement

షావోమీ స్మార్ట్ స్పీకర్ (ఐఆర్ కంట్రోల్) మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో ఉన్న ఐఆర్ ట్రాన్స్‌మిట్టర్ హోం అప్లయన్సెస్‌కు వాయిస్ రిమోట్ కంట్రోల్‌గా పనిచేయనుంది. ఈ స్పీకర్‌లో 1.5 అంగుళాల ఫుల్ రేంజ్ డ్రైవర్ ఉంది. ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఈ స్పీకర్‌లో అందించారు.

Continues below advertisement

షావోమీ స్మార్ట్ స్పీకర్ ధర
దీని ధరను మనదేశంలో రూ.5,999గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది రూ.4,999కే అందుబాటులో ఉంది. షావోమీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఇది లాంచ్ అయింది.

షావో స్మార్ట్ స్పీకర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
షావోమీ స్మార్ట్ స్పీకర్‌లో ఐఆర్ కంట్రోల్ ఫీచర్ ఉంది. దీంతో స్మార్ట్ హోం అప్లయన్సెస్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో 1.5 అంగుళాల ఫుల్ రేంజ్ డ్రైవర్ ఉంది. రెండు మైక్‌లు కూడా ఉన్నాయి. ఇది ఫార్ ఫీల్డ్ వాయిస్ వేకప్ సపోర్ట్ కూడా అందించారు.

ఇది ఎల్ఈడీ డిజిటల్ క్లాక్ డిస్‌ప్లేగా కూడా పనిచేయనుంది. అడాప్టివ్ బ్రైట్‌నెస్‌ను ఈ స్పీకర్ సపోర్ట్ చేయనుంది. డీఎన్‌డీ మోడ్‌లో పెట్టినప్పుడు లైట్‌ను ఇది డిమ్ చేస్తుంది. దీని బ్రైట్‌నెస్ లెవల్ ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటుంది. వినియోగదారులు తమకు కావాల్సిన పాటను అలారంగా పెట్టుకోవచ్చు. ప్లే, పాజ్, వాల్యూమ్ అప్ డౌన్, మ్యూట్ బటన్లు వీటిలో ఉన్నాయి. దీని బరువు 628 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Continues below advertisement