Tech Trends in 2026: సాంకేతిక ప్రపంచం హించని వేగంతో పరుగులు తీస్తోంది. 2026 నాటికి కృత్రిమ మేధస్సు మనం ప్రతి రోజూ చేసే పనుల్లో దాదాపు 70 శాతం వరకు ఆటోమేటిక్‌గా పూర్తి చేసే అవకాశం ఉంది. మెదడుతో నియంత్రించే పరికరాలు నుంచి రోబోట్ల వరకు మన భవిష్యత్‌ను నియంత్రించే టెక్నాలజీల గురించి ఇక్కడ చూద్దాం.   

Continues below advertisement

ఏఐ ఏజెంట్స్‌:- మొన్నటి వరకు ఏఐ ఏజెంట్స్ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం అయ్యేవి. ఇప్పుడు చాలా పనులు పూర్తి చేస్తున్నారు.ఆటో జీపీటీ వంటి టూల్స్ ఇప్పటికే పనులను ఒక చైన్‌లా కలుపుతూ, టూర్‌ ప్లాన్స్‌ వేయడం, రిజర్వేషన్లు బుక్ చేయడం లేదా క్లయింట్లకు ఆటోమేటిక్‌గా ప్రతిస్పందించడం వంటివి చేస్తున్నాయి. కంపెనీల్లో, ఉద్యోగులను ఆన్‌బోర్డ్ చేయడం, డేటా నిర్వహణ వంటి మొత్తం ప్రక్రియలను ఈ ఏజెంట్లకు అప్పగించేస్తున్నాయి.

ఎడ్జ్‌ AI చిప్స్‌: 2026 నాటికి, మీరు కొనే ప్రతి కొత్త ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో తప్పనిసరిగా AI చిప్ ఉంటుంది. ఎడ్జ్ AI అంటే క్లౌడ్ అవసరం లేకుండా, మీ పరికరంలోనే తక్షణమే స్మార్ట్ కార్యకలాపాలు జరుగుతాయి. లాగ్ (Lag) ఉండదు. ఆపిల్ A17 ప్రో, M4 చిప్‌లు ఇప్పటికే భాష అనువాదం, ఇమేజ్ ఎడిటింగ్ వంటి పనులు తక్షణమే చేస్తున్నాయి. ఇంటెల్ మెటియోర్ లేక్ చిప్‌లు ఎన్‌పీయూలతో వస్తున్నాయి, ఇవి తక్కువ శక్తిని ఉపయోగించి AI పనులను నిర్వహిస్తాయి.

Continues below advertisement

రోబోట్లు -ఆటోమేషన్: హ్యూమనాయిడ్‌ రోబోట్లు కేవలం నడవడం మాత్రమే కాదు, అవి ఇప్పుడు పనిచేయడం ప్రారంభించాయి. అమెజాన్ గొడౌన్స్‌లో అజిలిటీ రోబోటిక్స్ డిజిట్ రోబోట్లు పనిచేయడం మొదలుపెట్టాయి. టెస్లా ఆప్టిమస్ వంటి రోబోట్లు బట్టలు మడతపెట్టడం వంటి ప్రాథమిక పనులను చేస్తున్నాయి. ఈ రోబోట్లు ఇప్పుడు మరింత చౌకగా మారుతున్నాయి. 2026 నాటికి కొన్ని మోడళ్లు చిన్న కారు కంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. రిటైల్,  లాజిస్టిక్స్ రంగంలో వాల్‌మార్ట్ తమ స్టోర్లలో వేలాది అటానమస్ షెల్ఫ్ స్కానర్‌లను ఉపయోగిస్తోంది. కాలేజ్ క్యాంపస్‌లలో ఫుడ్ డెలివరీ కోసం స్టార్‌షిప్, కివి బోట్‌లు AI విజన్, రియల్ టైమ్ మ్యాపింగ్‌ను ఉపయోగిస్తున్నాయి.

బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లు (BCIs): ఈ ట్రెండ్‌లలో అత్యంత విప్లవాత్మకమైనది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లు (BCIs). 2024 ప్రారంభంలో న్యూరాలింక్ (Neuralink) తన మొదటి చిప్‌ను మానవుడిలో అమర్చినట్లు ఇప్పటికే ప్రకటించింది. దీని ద్వారా, ఆ వ్యక్తి కేవలం ఆలోచన ద్వారా కంప్యూటర్ కర్సర్‌ను నియంత్రించగలిగాడు. పక్షవాతం ఉన్నవారికి కదలిక లేదా కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని తిరిగి ఇవ్వడానికి సింక్రోన్, ప్రెసిషన్ న్యూరోసైన్స్ వంటి కంపెనీలు తక్కువ ఇన్వాసివ్ పరికరాలను అభివృద్ధి చేస్తున్నాయి.

ఆరోగ్య సంరక్షణలో AI : AI ఇప్పుడు ఆరోగ్య సంరక్షణను వ్యక్తిగతీకరిస్తోంది. గూగుల్ డీప్‌మైండ్ AI మోడల్, రెటీనా స్కాన్‌ల నుంచి 21 రకాల వ్యాధులను ముందుగానే గుర్తించగలుగుతుందని ప్రకటించింది. ఆసుపత్రులు సెప్సిస్ లేదా కార్డియాక్ రిస్క్ సంకేతాలను రోగలక్షణాలు కనిపించడానికి కొన్ని గంటల ముందుగానే గుర్తించడానికి AIని ఉపయోగిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్స ప్రణాళికలో, రోగి జన్యు నిర్మాణాన్ని బట్టి కీమో రెజిమన్‌లను వ్యక్తిగతీకరించడానికి AI ఉపయోగిస్తున్నారు.

AR గ్లాసెస్‌లు స్క్రీన్‌లను భర్తీ చేస్తాయి: ఆపిల్ విజన్ ప్రో అడుగు వేయడంతో ఇప్పుడు Meta, XR Real, Samsung వంటి కంపెనీలు రియల్ టైమ్ ఓవర్‌లేస్‌తో కూడిన తేలికపాటి AR గ్లాసులపై పనిచేస్తున్నాయి. 2026 నాటికి, మీరు టెక్స్ట్‌కు సమాధానం చెప్పడానికి మీ ఫోన్‌ను బయటకు తీయవలసిన అవసరం ఉండకపోవచ్చు. 

AI నేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్స్  : AI ఇకపై యాప్‌లలో మాత్రమే కాకుండా, నేరుగా ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో భాగం కాబోతోంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే విండోస్ 11లో కో-పైలట్‌ను పరీక్షిస్తోంది, ఇక్కడ మీరు డెస్క్‌టాప్‌ను ఫైల్‌లను సంగ్రహించమని, ఇమెయిల్‌లను తిరిగి రాయమని లేదా ఫొటోలు క్రియేట్ చేయమని అడగొచ్చు. ఆపిల్ కూడా తమ కొత్త న్యూరల్ ఇంజిన్‌లతో నడిచే MacOSS, iOSలో మరిన్ని AI నేటివ్ ఫీచర్లను ప్రకటించాలని భావిస్తున్నారు.