Continues below advertisement

Agentic AI Expalined: మార్వెల్ సిరీస్‌లో ఐరన్ మ్యాన్.. పర్సనల్ AI సిస్టమ్ తెలుసు కదా… J.A.R.V.I.S. (Just A Rather Very Intelligent System). నేరుగా ఓ మనిషితో మాట్లాడుతున్నట్లే తన AI అసిస్టెంట్‌కు కమాండ్‌ ఇస్తాడు.. అదే అన్ని పనులూ చేస్తుంటుంది. ఆ తర్వాత అతను డవలప్‌ చేసిన K.A.R.E.N సిస్టమ్ Spiderman వాడుతుంటాడు. అంతెందుకు మన రోబో సినిమాలో కనిపించిన చిట్టి రోబో అయితే ఇంకా అడ్వాన్స్‌డ్. అందులో సైంటిస్ట్ వశీకర్ చెప్పిన పనులన్నీ ఆ హ్యూమనాయిడ్ రోబో చేసి పెడుతుంది. అవన్నీ సినిమాలు కాబట్టి.. ఊహకు పరిమితులు లేవు కాబట్టి.. చాలా అడ్వాన్స్డ్‌గా చూపించారు. అయితే ఇప్పుడు మన ప్రపంచం అంటే.. టెక్నాలజీ ఉపయోగించేవాళ్ల ప్రపంచం కూడా మారిపోబోతోంది. మరీ ఈ సినిమాల్లో చూపించే అంత రేంజ్‌లో అడ్వెంచర్లు ఉండవ్‌ కానీ… ఇప్పుడున్న పరిస్థితిలో అయితే బాగా మార్పులొస్తాయి. Agentic AI తో అది సాధ్యం అవుతుంది.

అసలేంటిAgentic AI..?

Continues below advertisement

ఇప్పుడు మనం ChatGpt లాంటి ఓపెన్ AI, జనరేటివ్ AI సోర్సులు విపరీతంగా వేడేస్తున్నాం కదా.. దీనిని బాబు లాంటి టెక్నాలజీ ఈ ఏజెంటిక్ AI. ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌కు అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఇప్పుడున్న ChatGPT, Gemini, Perplexity వంటి AI టూల్స్ మన పనులనే మరింత సులభతరం చేసి పెడతాయి. అంటే మనం Prompt ఇస్తే దానికి అనుగునంగా మనకు కావలసిన పనులు AI చేసి పెడుతుంది. ఓ కమాండ్ ద్వారా కొంచం పెద్ద పనులు కూడా చేసుకోగలుగుతున్నాం. కోడ్‌లు రాయడం వంటి పెద్ద ప్రాసెస్ ఉన్న పనులూ పూర్తిచేస్తున్నారు. Agentic AI మనం ఇచ్చే టాస్క్ లను మొత్తం అదే సొంత నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి చేసి పెడుతుంది. పేరులోనే ఉన్నట్లు ఈ AI మన పనులన్నింటినీ ఓ ఏజెంట్ లా చేసి పెడుతుందన్నమాట. అందుకేపేరు. ఈ టెక్నాలజీ ద్వారా అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. మ్యాన్ పవర్ పై పెడుతున్న డబ్బులు కంపెనీలకు మిగలటంతో పాటు కంప్లీట్ ఆటోమేషన్ కారణంగా హ్యూమన్ ఎర్రర్ కి ఛాన్సే లేకుండా పనులు చక్కబెట్టొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Agentic పై పరిశోధనలు చేస్తున్న టెక్ దిగ్గజాలు

AI పై పరిశోధనలైనప్పుడే ఏజెంటిక్ AI పైనా ప్రయోగాలు మొదలయ్యాయి. అయితే ఏజెంటిక్ AI ను వినియోగించటంలో ఎన్ని లాభాలు ఉంటాయో అన్నే సవాళ్లు కూడా ఉంటాయి. అందుకే ఈ టెక్నాలజీ నార్మల్ పీపుల్ చేతుల్లోకి రావటానికి కాస్త టైమ్ పట్టింది. బట్ ఇప్పుడు ప్రపంచమంతా ఆటోమేషన్ వైపు పరుగులు తీస్తున్న టైమ్ లో ఏజెంటిక్ AI ని వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని టాప్ టెక్ కంపెనీలన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. OpenAI, Microsoft, GitHub, AWS లాంటి సంస్థలు ఏజెంటిక్ AIను డెవలప్ చేసి ఓ ఫినిషింగ్ ప్రొడక్ట్ గా ప్రజలకు పరిచయం చేయాలని కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి.

Agentic AI బిజినెస్ వైపు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏజెంటిక్ AI మార్కెట్ విలువ 6లక్షల కోట్లుగా ఉంది. 2032 నాటికి ఈ బిజినెస్ 200 బిలియన్ డాలర్స్ అంటే 16లక్షల కోట్లు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బిజినెస్ లో నార్త్ అమెరికా మార్కెట్టే 40 నుంచి 46శాతం వరకూ హోల్డ్ చేస్తోంది. ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న ఏ AI కంపెనీకైనా సరే 40 శాతం బేస్ ఇండియన్ మార్కెట్టే. మనోళ్లు AI ను అంతలా వాడేస్తున్నారు. 2026నాటికి 90శాతం భారత కంపెనీలు తమ వ్యాపారంలో AI ను భాగస్వామ్యం చేస్తారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంత అగ్రెసివ్ గా ఉన్న భారత్ ఏజెంటిక్ AI ను కూడా అంతే ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోగలదని అందరూ విశ్వసిస్తున్నారు.

Agentic తో సమస్యలు:

సరే దీని వల్ల ప్రాబ్సమ్ ఏం రావా అంటే అదే అసలు సమస్య. కొద్ది రోజుల క్రితం నటుడు నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు చూశారా...? ఆయన పర్సనాలిటీ రైట్స్ మీద ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అంటే ఇప్పుడు వస్తున్న సాంకేతికత సాయంతో నాగార్జున వాయిస్ ను ఇమిటేట్ చేసినా..ఫేషియల్ ఫీచర్స్ ను వాడుకున్నా...అదంతా ఆయన పర్మిషన్ తో జరగాలి లేదంటే వాడుకున్న వాళ్లు చట్టప్రకారం శిక్షకు అర్హులవుతారు. అంటే AI తీసుకువస్తున్న మార్పులు ఇలా మనుషల్లో భయాలను కూడా నింపుతున్నాయి. ప్రైవసీ థెఫ్ట్, సెక్యూరిటీ రిస్క్, హ్యాకింగ్ లాంటి భయాలు ఏజెంటిక్ AI వల్ల ఉంటాయని టెక్ నిపుణులే భయపడుతున్నారు. అయితే ఎలా వాట్సప్ లాంటి వాటికి ఎండ్ టూ ఎండ్ ట్రాన్స్ స్క్రిప్షన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో అలానే ఏజెంటింక్ AI ను కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేస్తూ టెక్ కంపెనీలు పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. అదే జరిగితే మరో రెండేళ్లలో ప్రతీ మనిషికి సాంకేతికతంగా చిట్టి రోబో లాంటి ఫ్రెండ్ చేతిలో ఉన్నట్లే..!