రియల్‌మీ మనదేశంలో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అదే రియల్‌మీ వాచ్ 3. గతేడాది జులైలో మనదేశంలో లాంచ్ అయిన రియల్‌మీ వాచ్ 3కి తర్వాతి వెర్షన్‌గా ఈ వాచ్ రానుంది. ఇందులో పెద్ద డిస్‌ప్లే ఉండనుంది. అయితే డిజైన్ మాత్రం ముందు వెర్షన్ తరహాలోనే ఉండనుంది.
దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజ్‌ని రియల్‌మీ తన వెబ్ సైట్‌లో లిస్ట్ చేసింది. ఈ పేజీలో ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ ఫీచర్లు చూడవచ్చు. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫంక్షన్ కూడా ఉండనుంది. ప్రస్తుతానికి ఈ వాచ్ గురించి మిగతా వివరాలు తెలియరాలేదు.
రియల్‌మీ టెక్‌లైఫ్ కూడా ఇదే తరహా వాచ్‌ను టీజ్ చేసింది. ఇందులో వెనకవైపు బ్లాక్ డయల్ ఉండనుంది. గ్రే స్ట్రాప్ కూడా ఇందులో అందించనున్నారు. పక్కభాగంలో ఫిజికల్ బటన్ కూడా ఉండనుంది. రియల్‌మీ త్వరలో కొత్త ట్యాబ్లెట్ కూడా మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే రియల్‌మీ ప్యాడ్ ఎక్స్.
ఇది ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. దీని చైనా వేరియంట్లో 11 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు.
128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్ కీబోర్డు, రియల్‌మీ మ్యాగ్నటిక్ స్టైలస్‌ను అందించారు. నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 8340 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!