రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ ఆర్100 మనదేశంలో లాంచ్ అయింది. టెక్‌లైఫ్ ఎకోసిస్టంలో ఈ వాచ్ లాంచ్ అయింది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫంక్షనాలిటీ కూడా ఉంది. స్మార్ట్ నోటిఫికేషన్లు, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్, ఇంకా మరిన్ని ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ ఆర్100 ధర
దీని ధరను రూ.3,499గా నిర్ణయించారు. బ్లాక్, గ్రే రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ ఆర్100ను కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ ఆర్100 స్పెసిఫికేషన్లు
ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. అంటే వాచ్ నుంచే కాల్స్ కూడా మాట్లాడేయవచ్చన్న మాట. ఇందులో 1.32 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 360 x 360 పిక్సెల్స్‌గా ఉంది. వివిడ్ కలర్స్‌ను ఇది డిస్‌ప్లే చేయనుంది.
దీంతోపాటు ఇందులో 100కు పైగా వాచ్ ఫేస్‌లు కూడా ఉన్నాయి. స్లైలైజ్డ్ థీమ్స్‌ను కంపెనీ ఇందులో అందించింది. రౌండ్ మెటల్ డయల్, అల్యూమినియం బెజెల్స్ కూడా ఈ వాచ్‌లో ఉన్నాయి. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను రియల్‌మీ టెక్‌లైఫ్ వాచ్ ఆర్100 సపోర్ట్ చేయనుంది.
ఎక్సర్‌సైజ్ చేసే సమయంలో రియల్‌టైం హార్ట్ రేట్ డేటాను ఇది డిస్‌ప్లే చేయనుంది. రియల్‌మీ వేర్ యాప్ ద్వారా యూజర్ డేటాను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌కు ఏఐ రన్నింగ్ పార్ట్‌నర్ కూడా ఉంది. హార్ట్ రేట్ సెన్సార్, బిల్ట్ ఇన్ త్రీ యాక్సిస్ యాక్సెలరేషన్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!