మనదేశానికే చెందిన ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ కొత్త నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అవే నాయిస్ నెర్వ్ ప్రో. బడ్జెట్ ధరలో మంచి ఇయర్‌ఫోన్స్ కావాలంటే ఇవే మంచి ఆప్షన్‌గా ఉండనున్నాయి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఏకంగా 35 గంటల ప్లేబ్యాక్ టైంను అందిస్తాయని కంపెనీ అంటోంది. కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తో ఏకంగా 10 గంటల బ్యాకప్‌ను ఇవి అందించనున్నాయి.


నాయిస్ నెర్వ్ ప్రో ధర
ప్రారంభ ఆఫర్ కింద నాయిస్ నెర్వ్ ప్రో ధర రూ.899గా ఉంది. ఈ ప్రారంభ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఆఫర్ అయిపోయాక ఎంత ధర నిర్ణయించనున్నారు? అనే విషయాలు తెలియరాలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇయర్‌ఫోన్స్ కొనుగోలు చేయవచ్చు. సియాన్ బ్లూ, నియో గ్రీన్, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.


నాయిస్ నెర్వ్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
బ్లూటూత్ వెర్షన్‌ 5.2 కనెక్టివిటీ ఆప్షన్‌తో నాయిస్ నెర్వ్ ప్రో నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఇయర్‌ఫోన్స్‌లో డ్యూయల్ పెయిరింగ్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఒకేసారి రెండు డివైస్‌లకు ఈ ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చన్న మాట. వీటి వైర్‌లెస్‌ రేంజ్‌ 10 మీటర్లుగా ఉండటం విశేసం. ముఖ్యంగా ఈ ఇయర్‌ఫోన్స్‌కు బ్యాటరీ మెయిన్ హైలెట్. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 35 గంటల ప్లేబ్యాక్ టైం లభిస్తుందని కంపెనీ అంటోంది. కేవలం 10 నిమిషాల చార్జ్‌తోనే 10 గంటల పాటు మ్యూజిక్ లేదా వీడియో కంటెంట్‌ను వీటి ద్వారా ఎంజాయ్ చేయవచ్చు.


కాల్స్ మాట్లాడేందుకు ఇన్‌లైన్ కంట్రోల్స్ ఉన్న మైక్రోఫోన్‌‌‌ను నాయిస్ నెర్వ్ ప్రో అందిస్తుంది. మన చుట్టూ పరిసరాల్లో ఎన్ని శబ్దాలు ఉన్నా ఇబ్బంది కలగకుండా ఎన్విరాన్‌మెంటర్ సౌండ్ రిడక్షన్ (ఈఎస్ఆర్) అనే కొత్త టెక్నాలజీతో ఈ ఇయర్‌ఫోన్స్ వస్తున్నాయి. బయటి ప్రాంతాల్లో కాల్స్ మాట్లాడే సమయంలో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ఈ ఇయర్‌ఫోన్స్‌లో మ్యాగ్నిటిక్ ఇయర్‌బడ్స్‌ను అందించారు. స్వెట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IPX5 రేటింగ్ కూడా ఇందులో ఉంది. అంటే చెమట, నీటి తుంపరలు వీటిపై పడినా ఏమీ కాదన్న మాట.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!