వన్‌ప్లస్ తన కొత్త ట్యాబ్లెట్‌ను మనదేశంలో ఈ సంవత్సరం లాంచ్ చేయాల్సింది. అయితే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఈ ట్యాబ్లెట్‌ను వచ్చే సంవత్సరం లాంచ్ చేయనుంది. అయితే ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం తెలియరాలేదు. దీని స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యయి.
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ల్యాప్‌టాప్ 2023 ప్రారంభంలో లాంచ్ కానుంది. ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన మాస్ ప్రొడక్షన్ కూడా ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది. యూరోపియన్, యూరో ఏషియన్ దేశాల్లో ఈ ప్రొడక్షన్ జరుగుతోందని సమాచారం.
ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం దీనికి సంబంధించిన ఇంటర్నల్ టెస్టింగ్ కూడా ప్రారంభం అయింది. అయితే దీనికి సంబంధించిన లాంచ్‌ను కంపెనీ ఎందుకు లేట్ చేస్తుందో అర్థం కాలేదు. ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే... ఈ ట్యాబ్లెట్‌లో 12.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
ఇక వెనకవైపు 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పని చేసే అవకాశం ఉంది. 10900 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. 45W ర్యాపిడ్ చార్జింగ్‌ను వన్‌ప్లస్ ప్యాడ్ సపోర్ట్ చేయనుంది.
దీంతోపాటు ట్యాబ్లెట్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ వీ5.1 సపోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీని ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. వన్‌ప్లస్ ప్యాడ్ 5జీ ట్యాబ్లెట్ 2,999 యువాన్లుగా (సుమారు రూ.35,950) ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!