రియల్‌మీ కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అవే రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2ఎస్. ఇవి 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించనున్నాయి. ఫాస్ట్ చార్జింగ్, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. వీటికి సంబంధించిన సేల్ కూడా రేపటి నుంచి (జులై 26వ తేదీ) జరగనుంది.
రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2ఎస్ ధర
వీటి ధరను రూ.1,299గా నిర్ణయించారు. జులై 26వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. బ్లాక్ అండ్ ఎల్లో, బ్లూ కలర్ ఆప్షన్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది అందుబాటులో ఉంది.
రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2ఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వీటిలో 11.2 ఎంఎం డైనమిక్ బేస్ డ్రైవర్లను అందించారు. ఏఐ ఈఎన్‌సీ వాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. స్పష్టమైన కాలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందించనుంది. దీంతోపాటు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా ఈ బడ్స్ సపోర్ట్ చేయనున్నాయి.
డ్యూయల్ డివైస్ ఫాస్ట్ పెయిరింగ్ ఇందులో ఉంది. కాబట్టి మ్యూజిక్ ప్లేబ్యాక్ చేసే సమయంలో రెండు డివైస్‌ల మధ్యలో పెయిర్ చేసుకోవచ్చు. దీంతోపాటు మ్యాగ్నటిక్ ఇన్‌స్టంట్ కనెక్షన్ ఫీచర్ కూడా అందించారు. దీని ద్వారా మీరు వాటిని అటాచ్ చేసినప్పుడు పవర్ ఆన్ అవుతాయి, డిటాచ్ చేసినప్పుడు పవర్ ఆఫ్ అవుతాయి.
ఇవి 24 గంటల ప్లేబ్యాక్ టైంను అందించనున్నాయి. 20 నిమిషాల పాటు చార్జ్ చేస్తే ఏడు గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. వీటిలో ఇన్ లైన్ రిమోట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. దీని ద్వారా వాయిస్ అసిస్టెంట్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.
రియల్‌మీ సబ్ బ్రాండ్ డిజో కూడా ఇటీవలే వైర్‌లెస్ యాక్టివ్ నెక్‌బ్యాండ్‌ను లాంచ్ చేసింది. వీటిలో 11.2 ఎంఎం ఆడియో డ్రైవర్ ఉంది. బేస్ బూస్ట్ ప్లస్ అల్గారిథంపై ఈ ఇయర్ బడ్స్ పనిచేయనున్నాయి. బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీనే ఇవి కూడా సపోర్ట్ చేయనున్నాయి.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!