లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ (మూడో తరం) మనదేశంలో లాంచ్ అయింది. ఫ్రోస్ట్ బ్లూ, స్టార్మ్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ట్యాబ్ కొనుగోలు చేయవచ్చు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ (మూడో తరం) ధర
ఇందులో వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999 కాగా, ఎల్టీఈ వేరియంట్ ధర రూ.21,999గా నిర్ణయించారు. అమెజాన్‌, లెనోవో అధికారిక అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో రిటైల్ చానెళ్లలో కూడా అందుబాటులోకి రానుంది.


లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ (మూడో తరం) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
దీని బరువు 465 గ్రాములుగా ఉంది. 10.61 అంగుళాల 2కే ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఈ ట్యాబ్‌లో అందించారు. 10 పాయింట్ మల్టీ టచ్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ముందువైపు, వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. 7700 ఎంఏహెచ్ బ్యాటరీ, 20W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పెన్ స్టైలస్‌ను ట్యాబ్‌తో పాటు అందించబోవడం లేదు.


మనదేశంలో గూగుల్ కిడ్స్ స్పేస్ ఉన్న మొదటి ట్యాబ్లెట్లలో ఒకటిగా లెనోవో దీని గురించి చెబుతోంది. కంటెంట్ ఫిల్టర్స్, సేఫ్టీ కంట్రోల్స్, పిల్లల కోసం ప్రైవసీ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఇది రానుంది. ఈ డెడికేటెడ్ మోడ్‌లో పిల్లల కోసం ప్రత్యేకమైన యాప్స్, బుక్స్, వీడియోలు ఉండనున్నాయి.


దీని మందం 0.74 సెంటీమీటర్లుగా ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను ఈ ట్యాబ్‌లో అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, నాలుగు స్పీకర్లు కూడా ఉన్నాయి. డాల్బీ అట్మాస్ టెక్నాలజీని లెనోవో కొత్త  ట్యాబ్లెట్ సపోర్ట్ చేయనుంది. 


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?