జియో కొత్త గేమ్ కంట్రోలర్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక వైర్‌లెస్ గేమింగ్ కంట్రోలర్. ఎక్కువ సేపు పనిచేసే రీచార్జబుల్ బ్యాటరీని ఇందులో అందించారు. క్లాసిక్, లైట్ వెయిట్ డిజైన్‌తో దీన్ని రూపొందించారు. రెండు వైబ్రేషన్ మోటార్లు, రెండు ప్రెజర్ పాయింట్ ట్రిగ్గర్లు ఇందులో ఉన్నాయి. అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని ఇవి అందించనున్నాయి. చాలా ఆండ్రాయిడ్ డివైస్‌లకు ఇది సపోర్ట్ చేస్తుందని కంపెనీ అంటోంది.
జియో గేమ్ కంట్రోలర్ ధర
ఈ గేమ్ కంట్రోలర్ ప్రస్తుతానికి జియో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. రూ.3,499కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. మాట్ బ్లాక్ ఫినిష్‌తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐల ద్వారా కూడా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
జియో గేమ్ కంట్రోలర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు, టీవీలను ఇది సపోర్ట్ చేయనుంది. బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ కంట్రోలర్ అందించనుంది. జియో సెట్ టాప్ బాక్స్ ద్వారా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. 2019 ఆగస్టులో ఈ సెట్ టాప్ బాక్స్ లాంచ్ అయింది. కన్సోల్ తరహా గేమింగ్, మిక్స్‌డ్ రియాలిటీ అనుభవాలను ఇది అందించనుంది. లో లేటెన్సీ కనెక్షన్ కోసం బ్లూటూత్ వీ4.1 టెక్నాలజీని ఈ గేమ్ కంట్రోలర్ ప్రొవైడ్ చేయనుంది. దీని వైర్‌లెస్ రేంజ్ 10 మీటర్లు.
రీచార్జబుల్ లిథియం ఇయాన్ బ్యాటరీని ఇందులో అందించారు. ఎనిమిది గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనున్నట్లు సమాచారం. మైక్రో యూఎస్‌బీ పోర్టు ద్వారా ఈ గేమింగ్ కంట్రోలర్‌ను చార్జ్ చేయవచ్చు. 20 బటన్ల లే అవుట్ ఇందులో ఉంది. రెండు ప్రెజర్ పాయింట్ ట్రిగ్గర్లు, 8-డైరెక్షన్ యారో బటన్ ఉన్నాయి. రెండు జాయ్ స్టిక్స్ అందించనున్నారు. రెండు వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ మోటార్లు ఉన్నాయి. హాప్టిక్ కంట్రోల్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని బరువు 200 గ్రాములుగా ఉండనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!