iPhone 16 Sale In India : టెక్ ప్రియులు, యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు ప్రారంభమైపోయాయి. ఏఐ సాంకేతిక లాగా యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో శక్తివంతంగా రూపొందింది. ఈ కొత్త మోడళ్లపై నెగటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. కానీ యూజర్స్ దాన్ని పట్టించుకోవట్లేదు. ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు భారీ సంఖ్యలో యాపిల్ స్టోర్‌ల ముందు క్యూ కట్టారు. ముంబయి, దిల్లీతో సహా పలు యాపిల్ స్టోర్ల బయట పెద్దఎత్తున కొనుగోలుదారులు బారులు తీరారు. ఇంకా చెప్పాలంటే రిలీజ్ సినిమా టికెట్ల వలే ఐఫోన్-16 కోసం యుద్ధాలు చేస్తున్నారు! ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి.
10 నిమిషాల్లో ఇంటికొచ్చేలా - అయితే ఈ ఐఫోన్‌ను ఇంటి వద్దకే చేర్చేలా సరికొత్త ప్రణాళికలను రచించింది. తమ నిత్యావసరాల సరఫరా యాప్ బిగ్ బాస్కెట్ నుంచి నిమిషాల్లో ఐఫోన్ డెలివరీ అయ్యేలా సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ విక్రయ విభాగం క్రోమాతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 10 నిమిషాల్లోనే వినియోగదారుడి చేతికి ఐఫోన్-16 అందేలా ప్రణాళికలను రచిస్తోంది. ఎటువంటి వెయిటింగ్ లేకుండా కస్టమర్ల అభిప్రాయాలకే మెుదటి ప్రాధాన్యత ఇస్తుంది.
ఆ నగరాల్లో మాత్రమే - అయితే ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్ నుంచి ఈ టాటా గ్రూప్ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ముంబయి, దిల్లీ - ఎన్‌సీఆర్‌లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ఐఫోన్ మోడల్ ఫోన్లపై ఎటువంటి ఆఫర్లను ప్రకటించలేదు బిగ్ బాస్కెట్.
బ్లింకిట్ కూడా 15 నిమిషాల్లోనే - బిగ్ బాస్కెట్‌కు పోటీగా బ్లింకిట్ కూడా ఈ ఐఫోన్16 సూపర్ ఫాస్ట్ డెలివరీల కోసం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం యూనికార్న్ సోర్స్‌తో అగ్రీమెంట్ చేసుకుందట. వినియోగదారుడు ఐఫోన్ ఆర్డర్ చేసిన కేవలం 15 నిమిషాల్లో కస్టమర్ చేతికి డెలివరీ అయ్యేలా ప్లాన్ చేస్తుందని తెలిసింది. అలానే పలు ఇన్‌స్టెంట్ డెలివరీల్లోనూ అదిరే ఆఫర్లను ప్రకటించింది బ్లింకిట్. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కొటక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.5,000 వరకు డిస్కౌంట్లను పొందే వెసులు బాటు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
ఐఫోన్ 16 సిరీస్ కొత్త మోడళ్లు ఇవే - ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐ ఫోన్ ప్రొ మ్యాక్స్ కొత్తగా విడుదల అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్లలో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు సరి కొత్త బటన్లను అమర్చింది యాపిల్. సరికొత్త చిప్ ఏ18తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
ఐఫోన్ 16 సిరీస్ ధరలు ఇవే - ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900గా అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్రొ ప్రారంభ ధర రూ.1,19,900గా మార్కెట్లోకి విడుదల చేశారు. ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,44,900గా నిర్ణయించారు.
Also Read: ఈ 5జీ స్మార్ట్ ఫోన్లలో ఏది బెస్ట్, ధర ఎంత? ఫీచర్ల పూర్తి వివరాలివే